ఓ తల్లి అంతులేని ఆవేదన, భరించలేని దుఃఖం, కట్టలు తెంచుకునే ఆక్రోశం. వీటితో పాటు కడుపున కనిపెంచిన కొడుకు, ఇంటికొచ్చిన కోడలు బతికుండగానే చూపించిన నరకం. ఇవేవి ఆ తల్లిని ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు, బతకనివ్వడం లేదు. ఇక ఈ భూమిపై ప్రశాంతత లేని బతుకు వద్దునుకుంది. నేరుగా జిల్లా ఎస్పీ వద్దకు వెళ్లి కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని వేడుకుంది. ఆ మహిళ వేడుకున్న తీరును చూసి ఎస్పీ ఒక్కసారిగా చలించిపోయాడు. ఇదే అంశం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన కాకినాడలో జరిగింది.
ఇది కూడా చదవండి: konaseema District: కోనసీమలో గుడిసెలో తల్లీకూతుళ్ల సజీవ దహనం… వెలుగులోకి సంచలన నిజాలు!
అసలేం జరిగిందంటే?.. గైగోలపాడుకు చెందిన అచ్చియమ్మ కొన్నాళ్ల నుంచి తన చిన్నకుమారుడి ఇంట్లో నివాసం ఉంటోంది. అయితే ఇటీవల తన కుమారుడు, కోడలు కలిసి అచ్చియమ్మను ఇంట్లో నుంచి బయటకు గెంటేశారు. దీంతో మనస్థాపానికి గురైన ఆ మహిళ స్థానిక అధికారులకు వివరించింది. అధికారులు ఎవరూ కూడా స్పందించి అచ్చియమ్మ న్యాయం చేయలేదు. దీంతో మరింత నిరాశలోకి వెళ్లింది. ఈ క్రమంలోనే ఆ మహిళ స్థానిక అధికారులతో న్యాయం జరగదని భావించి నేరుగా జిల్లా ఎస్పీనే కలిసింది. నా కొడుకు, కూతురు ఇంట్లో నుంచి గెంటేశారని, నాకు బతకాలని లేదు, చనిపోవడానికి అనుమతి ఇవ్వాలంటూ జిల్లా ఎస్పీని వేడుకుంది. అచ్చియమ్మ చనిపోవాలని ఎస్పీని కోరిన తీరు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.