Crime News: విద్యార్థికి చక్కగా చదువు చెప్పి, మంచి మార్గంలో ఉంచాల్సిన ఉపాధ్యాయుడు తప్పుదోవపట్టాడు. కొడుకులాంటి విద్యార్థిపై కన్నేశాడు. పరీక్షల్లో ఫేయిల్ చేస్తా! అని భయపెట్టి బాలుడితో తన కామ కోర్కెలు తీర్చుకున్నాడు. ఈ సంఘటన జార్ఖండ్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. జార్ఖండ్, ఈస్ సింగ్‌భూమ్ జిల్లాలోని కదమ్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన ఓ బాలుడు అక్కడి పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. ఆ బాలుడిపై స్కూలు ఉపాధ్యాయుడొకడు కన్నేశాడు. పరీక్షల్లో ఫేయిల్ చేస్తానని చెప్పి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇలా పలుసార్లు జరిగింది. సదరు బాలుడ్ని కానీ, బాలుడి చెల్లెల్ని కాని ఫేయిల్ చేస్తానని బెదిరించి దారుణానికి ఒడిగట్టేవాడు.
ఉపాధ్యాయుడి లైంగిక వేధింపుల కారణంగా బాలుడు మానసికంగా, శారీరకంగా తీవ్రంగా కృంగిపోసాగాడు. గత కొద్దిరోజుల నుంచి బాలుడు అదోలా ఉండటం గమనించిన కుటుంబసభ్యులు ఏం జరిగిందని అడిగారు. బాలుడు తనపై జరుగుతున్న అత్యాచారాన్ని చెప్పాడు. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడ్ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. బాలుడ్ని బెదిరించి పలుమార్లు అత్యాచారం చేసినట్లు గుర్తించారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : ప్రాంక్ వీడియో వెనకున్న అసలు విషయాలు బయటపెట్టిన రివ్యూ లక్ష్మణ్!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.