హర్యానాలో అక్రమ మైనింగ్ కు అడ్డుపడుతున్నారని డీఎస్పీ స్థాయి వ్యక్తిని కొందరు దుండగులు ట్రక్కుతో తొక్కించి చంపిన ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలంగా మారిన విషయం తెలిసిందే. అయితే ఇది మరువక ముందే తాజాగా జార్ఖండ్ లో ఓ మహిళ పోలీస్ ఆఫీసర్ ను కొందరు ముఠా సభ్యులు ఆవులు తరలించడానికి అడ్డుపడుతుందని ఆమెను వ్యాన్ తో తొక్కించి దారుణంగా హత్య చేశారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాంచీలో సంధ్య అనే మహిళ ఓపీ ఇంచార్జ్ గా విధులు నిర్వర్తిస్తుంది. పవర్ ఫుల్ ఫోలీస్ ఆఫీసర్ గా పేరు తెచ్చుకున్న సంధ్య అక్రమార్కుల వెన్నులో వణుకు పుట్టిస్తుంది. అయితే తాజాగా కొందరు దుండగులు అక్రమంగా గోవులను తరలిస్తున్నారు. ఈ విషయం ఓపీ సంధ్య వరకూ వెళ్లడంతో వెంటనే ఘటన స్థలానికి చేరుకుంది. అక్రమంగా గోవులను తరలిస్తున్న వారిపై ఉక్కుపాదం మోపాలని వారికి అడ్డు చెప్పింది.
ఇది కూడా చదవండి: తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని ఎంపీపై మహిళ ఫిర్యాదు..
దీంతో ఘటన స్థలంలో ఓపీ సంధ్యకు, గోవులను తరలిస్తున్న ముఠాకు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. ఇక కోపంతో ఊగిపోయిన ఈ ముఠా సభ్యులు పోలీస్ ఆఫీసర్ సంధ్యను వ్యాన్ తో దారుణంగా తొక్కించి హత్య చేశారు. దీనిపై స్పందించిన పై అధికారులు ఈ కేసును సీరియస్ గా తీసుకుంటున్నారు. హర్యానాలో జరిగిన ఓ దారుణం మురువక ముందే ఇలా జరగడం అనేది జార్ఖండ్ రాష్ట్రంలో కలకలంగా మారుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయలను కామెంట్ రూపంలో తెలియజేయండి.