Crime News: చావు ఎప్పుడు ఎలా మనల్ని పలకరిస్తుందో ఎవ్వరూ ఉహించలేం. అంతా బాగుంది అనుకునేలోగా ఏదో జరిగిపోతుంది. కొన్ని సార్లు చిన్న ప్రమాదంలాగే అనిపించినా ప్రాణాలు పోతుంటాయి. తాజాగా, జేసీబీకి గాలి కొడుతూ ఓ ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. టైర్ పేలటంతో ఈ దారుణం చోటుచేసుకుంది. ఈ సంఘటన ఛత్తీష్‌ఘర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు… ఛత్తీష్‌ఘర్‌లోని రాయ్‌పుర్ సిల్తారా ఇండస్ట్రియల్ ఏరియాకు చెందిన ఓ వాహనాల రిపేర్ షాపునకు సోమవారం ఓ జేసీబీ వచ్చింది. జేసీబీ టైర్లో సమస్య ఉంటే దాన్ని రిపేర్ చేశారు మెకానిక్‌లు. అనంతరం దానికి గాలి కొడుతూ ఉన్నారు. దాని మీద కూర్చున్న ఓ వ్యక్తి గాలి కొడుతూ ఉండగా.. పక్కన ఓ ఇద్దరు నిల్చుని ఉన్నారు.
కొద్దిసేపటి తర్వాత ఓ వ్యక్తి టైర్లో గాలి నిండిదా లేదా అని పరీక్షించటానికి రాడ్డుతో కొట్టాడు. ఆ తర్వాత అక్కడినుంచి వెళ్లిపోయాడు. అక్కడే ఉన్న మరో వ్యక్తి టైర్ దగ్గరకు వచ్చాడు. రెండు చేతులు దానిపై వేసి నొక్కి, అలాగే ఉండిపోయాడు. ఈ నేపథ్యంలో టైర్ ఒక్కసారిగా పేలింది. ఇద్దరూ గాల్లోకి లేచి కిందపడ్డారు. టైర్ ముక్కలై ఇనుము భాగం ఎగిరి పక్కనపడింది. గాల్లోకి ఎగిరిన ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతులిద్దరిదీ మధ్యప్రదేశ్‌లోని రెవా జిల్లాగా గుర్తించారు. మరి, ఈ విషాద ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
— K I N G (@KingKalyanPK) May 5, 2022
ఇవి కూడా చదవండి : News: రక్షణ కోసం వస్తే.. స్టేషన్లోనే బాలికపై అత్యాచారం చేసిన పోలీస్!