మారుతున్న కాలానికి అనుగుణంగా సమాజంలో ఆడవాళ్లపై వేధింపుల పర్వం కొనసాగుతూనే ఉంది. వరకట్న వేధింపుల్లో భాగంగా కోడళ్లపై భర్తతో పాటు అత్తామామలు కూడా తీవ్ర వేధింపులకు గురి చేస్తున్నారు. ఇక ఇంతటితో ఆగకుండా ఆత్మహత్యగా చిత్రీకరించి హత్య చేస్తున్నారు కొందరు అత్తింటి వారు. ఇలా అత్తింటివాళ్ల వేధింపుల భరించలేని అనేక మంది మహిళలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
ఇలాంటి వేధింపుల్లో భాగంగానే కొండాపూర్‌లోని శ్రీరాంనగర్ లో గ్లోరీ అనే వివాహిత అనుమానాస్పదంగా అత్తవారింట్లో ఈ నెల 12న మరిణించిన విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన ఈ విషాద ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఇక ఇదే విషయంపై గ్లోరీ తండ్రి.. తన కూతురు మరణంపై అనుమానాలున్నాయంటూ తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఇది కూడా చదవండి: Shahinath Gunj: బేగంబజార్ పరువు హత్య.. నిందితుల దగ్గరకు సంజన, నీరజ్ కుటుంబసభ్యులు
నా కూతురిని చంపి.. బాత్రూమ్‌లో పడిపోయిందని, బెడ్రూమ్‌లో మంచం తగిలిందని, ఫ్యాన్‌కు ఉరి వేసుకుందని ఇలా పలు విధాలుగా అత్తింటింవాళ్లు కట్టుకథలు అల్లుతున్నారని తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నారు. గతంలో నా కూతురిని భర్తతో పాటు అత్తామామలు, ఆడపడుచులు అనేక రకాలుగా వేధింపులకు గురి చేశారు. ఆ సమయంలో నా కూతురికి సర్దిచెప్పి తానే మెట్టింటికి పంపించానని గ్లోరీ తండ్రి తన ఆవేదన వ్యక్తం చేశాడు.
నా కూతురిని వేధింపుకులకు గురి చేసిన అత్తా, మామలతో పాటు ఆడపడుచులను కూడా అరెస్ట్ చేయాలంటూ ఆయన ఫిర్యాదులో తెలిపాడు. దీంతో ఇప్పటికే గ్లోరీ మరణంపై అనుమానాస్పద కేసు కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఇదిలా ఇంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారంగా నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు సైతం తెలిపారు. మరి.. అనుమానాస్పదంగా మరణించిన ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.