సోషల్ మీడియాలో అందుబాటులోకి వచ్చాక నేరాల శాతం రోజు రోజుకు రెట్టింపు వేగంతో పెరుగుతోంది. ఫేస్ బుక్, ఇన్ స్ట్రాగ్రామ్ ఇలా అనేక రకాల సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లను వేదికలుగా చేసుకుని కొందరు కేటుగాళ్లు నేరాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి వాటిల్లో అమ్మాయిల పేర్లతో రిక్వెస్ట్ రాగానే కొందరు అమాయక యువత ఎగేసుకుని ఆక్సెప్ట్ చేస్తూ చివరికి బొక్కబోర్ల పడుతున్నారు. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ హైదరాబాద్ యువకుడు నిండా మునిగాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
ఇది కూడా చదవండి: Kadapa: రైల్వేలో ఉద్యోగాలంటూ.. 10 మందికి కుచ్చుటోపీ!
ఇక వివరాల్లోకి వెళ్తే.. జూబ్లీహిల్స్ కు చెందిన ప్రవీణ్ అనే వ్యక్తికి గతంలో అమ్మాయి పేరుతో రిక్వెస్ట్ వచ్చింది. డీపీలో అమ్మాయి బాగుందని ప్రవీణ్ ఆలోచించకుండా ఆక్సెప్ట్ చేశాడు. దీంతో ఇద్దరి మధ్య పరిచయం పెరిగింది. ఆ పరిచయంతో ప్రవీణ్ కు లవ్ ప్రపోజల్ కూడా వచ్చింది. దీంతో సంబరపడ్డ ప్రవీణ్ ప్రేమను అంగీకరించాడు. ఇలా రోజు వాయిస్ కాల్ చేంజర్ యాప్ ద్వారా అమ్మాయిలా మాట్లాడుతూ అశోక్ అనే వ్యక్తి మోసం చేయసాగాడు.గతంలో ఒంట్లో బాగలేదని, అమ్మకు, నాకు కరోనా సోకిందని, ఎగ్జామ్ ఫీజు కట్టాలని ఇలా ఎన్నో రకాలుగా నిందితుడు అశోక్ ప్రవీణ్ నుంచి సమారుగా రూ.45 లక్షలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇక చివరికి రిక్వెస్ట్ పంపింది అమ్మాయి కాదని అబ్బాయి అని ప్రవీణ్ డబ్బులు పంపాక తెలుసుకున్నాడు. దీంతో నేను మోసపోయానని గ్రహించాడు. వెంటనే ప్రవీణ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నాకు న్యాయం చేయాలంటూ ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇలాంటి మోసాలకు ఎవరూ కూడా బలవ్వొద్దంటూ సీపీ ఆనంద్ కుమార్ సూచించారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.