మారుతున్న టెక్నాలజీ కారణంగా కొంత మంది యువత మంచి దారుల్లో వెలుతుంటే మరికొందరు చెడు దారులకు మార్గాలను వెత్తుకుంటున్నారు. మరీ ముఖ్యంగా సోషల్ మీడియా ప్రతీ ఒక్కరికీ అందుబాటులోకి రావడంతో కొందరు ఇష్టమొచ్చిన రీతిలో టైమ్ పాస్ చేస్తున్నారు. ఇంకొందరు కేటుగాళ్లు ఎవరూ ఊహించని మోసాలకు పాల్పడుతే నేరాలు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే నేటి కాలంలో చాలా మంది యువత సోషల్ మీడియాను విపరీతంగా వాడుతున్నారు. ఇందులో భాగంగానే కొంతమంది ఇన్ స్టాగ్రామ్ లో రీల్స్ కోసం మరీ దిగజారుతున్నారు. రోడ్లపై ఎక్కడపడితే అక్కడ వీడియోలు చేస్తూ గలీజ్ పనులకు తెరతీస్తున్నారు. అయితే తాజాగా ఓ యువతి హైద్రాబాద్ లో మెట్రో స్టేషన్ ఓ సాంగ్ రెచ్చిపోయి డ్యాన్స్ చేస్తూ రీల్స్ చేసింది. అది మెల్ల మెల్లగా మెట్రో అధికారుల వరకూ వెళ్లింది.
ఇది కూడా చదవండి: పెళ్లై నెలరోజులు.. ప్రియుడిని మర్చిపోలేకపోయింది..
దీంతో వెంటనే స్పందించిన అధికారులు ఆ యువతిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతోంది. నేటి కాలం యువత లైకుల కోసం మరీ ఇంతల దిగజారాలా? అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. రీల్స్ కోసం యువతి చేసిన ఈ వ్యవహారంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.