Hyderabad: ఈత సదరాకు ఓ బాలుడు బలయ్యాడు. స్విమ్మింగ్ పూల్ నిర్వహకుల నిర్లక్ష్యం కారణంగా నిండు ప్రాణం పోయింది. ఈ సంఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. లింగంపల్లికి చెందిన విశ్వనాథ్, రేణుక దంపతుల పెద్ద కుమారుడు మనోజ్‌కు పదేళ్లు. వేసవి సెలవుల్లో నాగోల్‌లోని అమ్మమ్మగారింటికి వచ్చాడు. ఆదివారం స్నేహితులతో కలిసి నాగోల్‌లోని బ్లూ ఫ్యాబ్ స్విమ్మింగ్‌పూల్‌కు వెళ్లాడు. ఈత కొడుతుండగా నీళ్లలో మునిగి పోయాడు. ఇది గమనించిన తోటి ఈతగాళ్లు బాలుడ్ని పైకి తీసి రక్షించే ప్రయత్నం చేశారు. అయినప్పటికి లాభం లేకపోయింది. నీళ్లలో ఊపిరాడక బాలుడు మృతిచెందాడు.
స్విమ్మింగ్‌పూల్ నిర్వహకులు సరైన సరైన జాగ్రత్తలు తీసుకోకుండా తమ కుమారుడి మృతి కారణమయ్యారని బాలుడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. స్విమ్మింగ్ పూల్ వద్ద తమకు న్యాయం చేయాలంటూ ఆందోళన చేపట్టారు. మరొక కుటుంబంలో ఇలాంటి విషాదం జరగకుండా చూడాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. స్విమ్మింగ్ పూల్ యజమానిని అరెస్ట్ చేశారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Yadadri: యాదాద్రిలో పుణ్యస్నానం ఆచరిస్తూ బాలిక మృతి! మానవత్వం మరిచిన ఆలయ అధికారులు
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.