Crime News : అత్తాకోడళ్ల మధ్య గొడవలు జరగటం సహజమే. కానీ, ఆ గొడవలు హద్దు దాటితే పరిస్థితి దారుణంగా ఉంటుంది. సాధారణంగా అత్తలు కోడల్ని సాధించే సంఘటనల కంటే కోడళ్లు ముసలి వాళ్లయిన అత్తల్ని హింసించటాలే ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. తాజాగా, ఓ కోడలు తను పెట్టిన దాని కంటే ఓ చపాతీ ఎక్కువ తిన్నదన్న కోపంతో అత్తను దారుణంగా కొట్టి జైలు పాలైంది. ఈ సంఘటన హర్యానాలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. హర్యానా, బడ్డీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖుర్ద్ గ్రామానికి చెందిన 75 ఏళ్ల ఇశ్వంతి, మనీషా అత్తాకోడళ్లు. కొద్ది రోజుల క్రితం మనీషా అత్తకు తినటానికి ఓ చపాతీ పెట్టింది. అది తిన్న తర్వాత ఆమె మనవడు ఇంకో చపాతీ తీసుకువచ్చి ఇచ్చాడు.
పాపం కోడలు ఇచ్చిన ఒక్క చపాతీతో కడుపునిండకపోవటంతో ఆమె మనవడు ఇచ్చిన చపాతీ తీసుకుని తింది. ఈ విషయం కోడలికి తెలిసింది. అంతే! అత్తపై దాడికి దిగింది. ఇష్టం వచ్చినట్లు కొట్టింది. ఆమెకు అండగా నిలుస్తూ తమ్ముడు కూడా ఇశ్వంతిపై దాడి చేశాడు. ఈ దాడి మొత్తాన్ని పొరుగింటి వారు సెల్‌ఫోన్‌తో వీడియో తీశారు. వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దాడి చేసిన కోడల్ని, ఆమె సోదరుడ్ని అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : కూతురుపై అత్యాచారం! ఆ కామాంధుడుకి తండ్రి ఎలాంటి శిక్ష వేశాడంటే?
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.