హన్మకొండలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమించలేదని యువకుడు కత్తితో ఓ యువతి గొంతు కోసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. యువతి కాకతీయ యూనివర్సిటీలో ఎంసీఏ చదువుతోంది. అయితే గత కొంత కాలం నుంచి అజహర్ అనే యువకుడు యువతిని ప్రేమించాలంటూ వెంటపడుతున్నాడు. దీంతో ఆ యువతి అతని ప్రేమకు నిరాకరించింది. అయినా వదలకుండా అజహన్ గత కొన్ని రోజుల నుంచి యువతి వెంట పడుతున్నాడు.
ఇది కూడా చదవండి: మహిళా వాలంటీర్ దారుణ హత్య.. ఇనుపరాడ్డుతో కొట్టి ఆపై!
కాగా ఆ యువతి హన్మకొండ పోచమ్మ గుడి దగ్గర నివాసం ఉంటుంది. ఇక శుక్రవారం ఉదయం ఆ యువకుడు యువతి ఇంటికి వచ్చి ప్రేమించాలంటూ మళ్లీ చెప్పాడు. దీంతో ఆ యువకుడిపై యువతి ఆగ్రహం వ్యక్తం చేయడంతో అజహర్ కత్తితో ఆ యువతి గొంతు కోసి అక్కడి నుంచి పరారయ్యాడు. వెంటనే తల్లిదండ్రులకు సమాచారం అందడంతో హుటాహుటిన వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించి ఎమర్జెన్సీ వార్డులో చికత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.