అతని పేరు కర్నాటి సతీష్‌బాబు అలియాస్ సత్యకుమార్. పల్నాడు జిల్లా క్రోసూరు మండలానికి చెందిన ఇతను అమెరికాలోని వాషింగ్టన్‌లో పనిచేస్తున్నాడు. అగ్రరాజ్యం అమెరికాలో కొలువు అని ఎంతో మంది యువతులను మోసం చేశాడు. పెళ్లి కాలేదని నమ్మించి కోరుకున్న యువతిని పెళ్లి చేసుకుని ఎంజాయ్ చేసి ఆ తర్వాత వదిలేసినట్లుగా వార్తలు వినిపించాయి. ఇలా ఒకటి కాదు, రెండు కాదు.., ఏకంగా ఐదు పెళ్లిళ్లు చేసుకున్నట్లు సమాచారం. ఇక చాలా ఏళ్లకు ఇతని లీలలు బయటపడడంతో సతీష్ బాబు ఇప్పుడు నోట్లోనీళ్లు నములుతున్నాడు. గుట్టుగా సాగించిన సతీష్ బాబు చీకటి వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది.
ఇదిలా ఉంటే.., సతీష్ బాబుకు గుంటూరు జిల్లా రవీంద్రనగర్‌కు చెందిన ఓ మహిళ పరిచయమైంది. ఈ పరిచయంతోనే సతీష్ యువతి తల్లిదండ్రులను ఒప్పించి ఈ ఏడాది జూన్ 16న పెళ్లి చేసుకున్నారు. ఇక పెళ్లి అనంతరం ఈ దంపతులు హైదరాబాద్ లోని కేపీహెచ్ బీలో కాపురం పెట్టారు. పెళ్లైన కొన్ని రోజుల పాటు వీరి సంసారం బాగానే గడిచింది. అయితే ఉన్నట్టుండి సతీష్ బాబు భార్య భర్త ఫోన్ వాట్సాప్ లో ఓ చాటింగ్ చూసింది. ఆ చాటింగ్ లావాణ్య అనే మహిళ పేరుతో ఉండడంతో భార్యకు అనుమానం వచ్చింది. ఏంటా అని భర్తను నిలదీయగా.., అవును నేను గతంలో లావణ్య అనే మహిళను పెళ్లి చేసుకున్నానని చెప్పడంతో భార్య తెల్లమొహమేసింది.
ఇక భార్య అందరినీ తెలుసుకోగా గతంలోనే ఇతడు అనేక పెళ్లిళ్లు చేసుకున్నాడని తెలిసి ఒక్కసారిగా షాక్ కు గురైంది. అయితే ఈ విషయాలన్నీ భార్యకు తెలియడంతో భర్త భార్యతో పడకగదిలో ఏకాంతంగా ఉన్నప్పుడు భార్యకు తెలియకుండా వీడియోలు తీశాడు. ఈ క్రమంలోనే ఇంటికి కోసం రుణం తీసుకురావాలని లేకుంటే నీ అశ్లీల వీడియోలు బయటపెడతానంటూ బ్లాక్ మెయిల్ కు దిగాడు. తన విషయాలు బయటపెడితే నీ వీడియోలు బయటపెడతానంటూ బెదిరింపులకు పాల్పడేవాడు. ఇక భర్త ఆగడాలను భరించలేకపోయిన ఆ ఇల్లాలు ఎట్టకేలకు పోలీసులను ఆశ్రయించింది. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ మొదలు పెట్టారు. అయితే పోలీసుల విచారణలో మాత్రం సతీష్ బాబుకు నిజంగానే ఆరు పెళ్లిళ్లు అయినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనపై మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సతీష్ బాబు చీకటి వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: లేడీ కానిస్టేబుల్ కోసం స్టేషన్ లోనే కొట్టుకున్న పోలీసులు!