నేటి కాలం యువత తెలిసి తెలియని వయసులో ప్రేమలో పడటం, ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో చివరికి బ్రేకప్ చెప్పుకుంటున్నారు. ఇక బ్రేకప్ తర్వాత అంతటితో ఆగుతున్నారా అంటే అదీ లేదు. కొంత మంది అయితే ఏకంగా హత్యలు చేయడం, లేదంటే ఆత్మ హత్యలు చేసుకోవడం వంటి ఘటనలు కోకొల్లలుగా పుట్టుకొస్తున్నాయి. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ ప్రియుడు ప్రియురాలు బ్రేకప్ చెప్పిందని కక్ష తీర్చుకున్నాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశం అవుతోంది.
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గోవాలోని కిషన్ కలంట్కర్(26) అనే యువకుడు కాలేజీ రోజుల్లో ఓ యువతిని ప్రేమిస్తున్నానని వెంట పడ్డాడు. కొన్ని రోజుల తర్వాత ఆ యువతి కూడా అతని ప్రేమకు ఒప్పుకుంది. దీంతో ఇద్దరు కలిసి కొన్నాళ్ల పాటు సినిమాలు, షికారులు అంటూ తెగ తిరిగారు. ఇక కొన్నాళ్ల తర్వాత వీరిద్దరికి మనస్పర్ధలు రావడంతో గొడవలు పడ్డారు. అయితే ఇలా అయితే కాదని భావించిన ప్రియురాలు ప్రియుడిని వదిలేద్దమని అనుకుని అతనికి బ్రేకప్ చెప్పింది.
ఇది కూడా చదవండి: Shahinath Gunj: హైదరాబాద్‌లో మరో పరువు హత్య.. కత్తులతో 15 పోట్లు పొడిచి చంపారు..
దీంతో ఖంగుతిన్న యువకుడు ఎలాగైన తన ప్రియురాలిని వదులకోవద్దని మాత్రం డిసైడయ్యాడు. ఇక ఇందులో భాగంగానే యువతితో కలిసి బుధవారం ఆ యువకుడు సౌత్‌గోవాలోని వెల్సాన్ బీచ్‌కు వెళ్లాడు. అక్కడ తన ప్రియురాలిని ఒప్పించే ప్రయత్నం చేశాడు. కానీ ఎంతకు కూడా ప్రియురాలు ఒప్పుకోలేదు. దీంతో కోపంతో ఊగిపోయిన ప్రియుడు తన వెంట తెచ్చుకున్న కత్తితో ప్రియురాలని దారుణంగా హత్య చేశాడు.
ఇక అనంతరం ఎవరికీ కనిపించకుండా గోవాలోని చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి పారేశాడు. వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు. బీచ్ సమీపంలోని గుర్తు తెలియని శవాన్ని పోలీసులు గుర్తించారు. ఇక కేసు నమోదు చేసుకున్న విచారణ చేపట్టి ఎట్టకేలకు ప్రియుడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.