Designer Prathyusha: ‘‘బొటిక్నుంచి రాత్రికి ఫ్రెండ్స్ దగ్గరకు వెళతాను. రేపు ఉదయమే వస్తాను’’ శుక్రవారం సాయంత్రం ఇంటినుంచి బయలు దేరేటప్పుడు ప్రత్యూష ఇంట్లో వాళ్లతో అన్న చివరి మాటలు. ఆ తర్వాత సాయంత్రం 4.00 గంటల సమయంలో బోటిక్ వాచ్‌మ్యాన్ భార్య ‘‘ మేడమ్ ! నేను కొట్టు దగ్గరకు వెళుతున్నాను’’ అని చెప్పగా.. ‘‘ నేను పిలుస్తాను దుర్గ.. ఇప్పుడేమీ అవసరం లేదు. నేను రమ్మన్నపుడే రా! అప్పటి వరకు ఏం అవసరం లేదు ’’ అని అన్నారు. ఈ మాటల తర్వాత బోటిక్లోకి వెళ్లిన ప్రత్యూష.. రాత్రి 12 గంటల ప్రాంతంలో విగత జీవిగా కనిపించింది. ఆమె ఆత్మహత్యకు తీవ్రమైన ఒత్తిడి కారణమని పోలీసులు భావిస్తున్నా.. ఆ ఒత్తిడి ఎందువల్ల కలిగిందన్న దానిపై స్పష్టత లేదు.
ప్రత్యూష స్వతహాగా పేరు, ప్రఖ్యాతలు సంపాదించుకుంది. ఆర్థికంగా కూడా స్థిరపడింది. ఆమె కుటుంబం కూడా స్థితిమంతమైనది. తండ్రి బిజినెస్‌ను కాదని ఆమె ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. సక్సెస్‌ను సాధించింది. టాలీవుడ్‌నుంచి బాలీవుడ్ వరకు పేరు ప్రఖ్యాతలు సంపాదించింది. అయినా, ఏదో లోటు.. అది కూడా ప్రాణాలు తీసుకునేంత ఒత్తిడి. కానీ, ఏ విషయంలో అన్నది ఓ క్వశ్చన్ మార్క్. ప్రత్యూషకు రామ్ చరణ్ భార్య ఉపాసన వంటి బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. అలాంటి బెస్ట్ ఫ్రెండ్స్‌కు కూడా చెప్పుకోలేని ఇబ్బందులు, ఒత్తిళ్లు ఏమున్నాయి?. ప్రత్యూష గదిలో దొరికిన సూసైడ్ నోట్లో.. తల్లిదండ్రులకు భారంగా ఉండకూడదని ఆత్మహత్య చేసుకుంటున్నట్లు రాసుంది.
మరి, ఆమె ఏ విషయంలో తల్లిదండ్రులకు భారంగా మారింది?.. బోటిక్ సరిగా నడవక ఆర్థిక ఇబ్బందుల్లో ఉందా?.. తల్లి దండ్రుల మీద ఆధారపడాల్సి వచ్చిందా?.. అందుకే అలా రాసిందా?.. అన్నవి కూడా క్వశ్చన్ మార్కులే. ప్రత్యూష క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకోలేదు. పక్కా ప్రణాళికతో 10 రోజుల ముందునుంచే తనను తాను సిద్ధం చేసుకుంది. అంటే! ఆత్మహత్య చేసుకోవాలని ఆమె బలంగా ఫిక్షయింది. అంత బలంగా ఆత్మహత్యకు ప్రేరేపించిన కారణం ఏంటి?.. ఆమెను చావుకు దగ్గర చేసిన తీవ్రమైన డిప్రెషన్ ఎందువల్ల వచ్చింది?.. ఇలా ఒక ఆత్మహత్యలో వందల కొద్దీ ప్రశ్నలే మిగిలాయి. మరి, ప్రత్యూష ఆత్మహత్యకు ఒత్తిడే కారణమా అన్న దానిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Designer Prathyusha: ప్రత్యూష ఆత్మహత్య కేసు.. దర్యాప్తులో వెలుగు చూస్తున్న సంచలన విషయాలు..