Bihar: కొంతమంది దుర్మార్గులు కన్నీమిన్నీకానకుండా అకృత్యాలకు పాల్పడుతున్నారు. కామంతో కళ్లు మూసుకుపోయి రక్తం పంచుకుపుట్టిన వారిపైనే అత్యాచారాలు చేస్తున్నారు. తనపై అత్యచారానికి పాల్పడిన తండ్రిపై వినూత్నంగా న్యాయపోరాటానికి దిగిందో యువతి. ఏకంగా తండ్రి తనపై అత్యాచారం చేస్తున్న దృశ్యాలను వీడియో తీసి సోషల్‌మీడియాలో ఉంచింది. ఆ వీడియో చూసి తనకు న్యాయం చేయండంటూ నెటిజన్లను వేడుకుంది. యువతి వీడియో ఆధారంగా పోలీసులు సదరు కామాంధుడ్ని అరెస్ట్ చేశారు. ఈ సంఘటన బిహార్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బిహార్‌లోని సమస్తిపుర్ జిల్లా రోసెరాకు చెందిన 50 ఏళ్ల వ్యక్తి కాలేజ్లో ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అతడు సొంత కూతురిపైనే కన్నేశాడు.
ఆమెపై తరచూ అత్యాచారానికి పాల్పడేవాడు. ఈ నేపథ్యంలో కూతురు తీవ్ర మనోవేధనకు గురయ్యేది. తండ్రికి ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకుంది. తండ్రి తనను రేప్ చేసే దృశ్యాలను సీక్రెట్ కెమెరా ద్వారా రికార్డు చేసింది. ఆ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేసింది. తండ్రి అకృత్యాలను బయట పెట్టింది. ఆ వీడియో చూసి తనకు న్యాయం చేయాలని కోరింది. వైరల్ అయిన వీడియో ఆధారంగా పోలీసులు బాధితురాలిని కలిశారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. నిందితుడ్ని అరెస్ట్ చేశారు. ఇందుకు సహకరించిన వారిపై కూడా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.