crime news : ప్రేమ కొందరికి వరం.. మరికొందరికి శాపం.. దాన్ని అందుకోవటం అంత సులభం కాదు. కొంతమందిని అందీ అందని ద్రాక్షలాగ ఊరిస్తూ ఉంటుంది. మరి కొందరికి అందినట్లే అంది దూరం అవుతుంది. టూ సైడ్ లవ్‌లో ఉన్నవాళ్ల బాధలు మరోలా ఉంటాయి. పెద్ద వాళ్ల అంగీకారంతో పెళ్లి జరగటం ఓ పెద్ద అచీవ్‌మెంట్. పెద్ద వాళ్లు ఒప్పుకోకపోతే.. పెళ్లి కాదు.. అసలు ప్రేమంటేనే నచ్చదని అంటే?.. పరిస్థితి దారుణంగా ఉంటుంది. ప్రియాంక అనే అమ్మాయిలాగా ప్రాణాలు తీసుకోవాల్సి వస్తుంది. పెద్దలు ప్రేమ వద్దన్నారన్న బాధతో ఈమె ప్రాణాలు తీసుకుంది. ఈ సంఘటన వరంగల్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
వరంగల్, పాలకుర్తి మండలంలోని మల్లంపల్లి గ్రామం బిక్షు నాయక్ తండాకు చెందిన ప్రియాంక హనుమకొండలోని ఓ ప్రైవేట్ కాలేజ్‌లో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. ఓ యువకుడిని ఆమె ప్రేమించదనే విషయం తల్లిదండ్రులకు తెలిసింది. దీంతో వారు ప్రేమ గీమ వద్దని హెచ్చరించారు. దీంతో ఆమె మనస్తాపానికి గురైంది. శనివారం ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో పురుగుల మందు తాగింది. ఆపస్మారక స్థితికి చేరుకున్న ఆమెను జనగామ జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృత్యువాత పడింది. దీనిపై ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : మహిళతో బాబాయ్ సంబంధం.. చూసిన అన్న కొడుకును దారుణంగా..
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.