Crime News : ప్రపంచానికి పట్టిన పీడ పోర్న్.. వయసుతో సంబంధం లేకుండా అన్ని గ్రూపుల వారిని చెడగొడుతోంది. పోర్న్‌కు బానిసైన వారు నేరాలకు పాల్పడుతున్నారు. వీడియోలు చూసిన క్షణికావేశంలో అత్యాచారాలు చేస్తున్నారు. తాజాగా, ఐదుగురు స్కూలు పిల్లలు పోర్న్ వీడియోలు చూసిన క్షణికావేశంలో ఇద్దరు బాలికలను రేప్ చేశారు. ఈ సంఘటన బిహార్‌లో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బిహార్ షేక్‌పురా జిల్లా బార్బిగా పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన ఐదుగురు టీనేజర్లు అక్కడి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. వీరంతా 8వ తరగతి లోపు చదువుతున్నవారే. సోమవారం సాయంత్రం వీరంతా స్మార్ట్ ఫోన్లో పోర్న్ వీడియోలు చూశారు. ఆ ఉద్రేకంలో అక్కడికి దగ్గరలో ఉన్న పొలంలో పనిచేసుకుంటున్న ఇద్దరు బాలికలపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు.
అనంతరం వారిని బాగా కొట్టి విషయం ఎవరికైనా చెబితే చంపుతామని బెదిరించారు. ఒకరికి మూడు రూపాయలు, మరొకరికి ఐదు రూపాయలు ఇచ్చి అక్కడినుంచి వెళ్లిపోయారు. ఇంటికి వెళ్లిన ఓ బాలిక ఆరోగ్యం క్షీణించటంతో విషయం బయటపడింది. బాలిక తల్లిదండ్రులు ఇద్దరు నిందితులను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అత్యాచారంపై కేసు పెట్టారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మిగిలిన ఇద్దర్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. బాలికలను వైద్య పరీక్షల నిమిత్తం పంపారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్లరూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.