crime news : భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావటం సహజమే. అలాంటి సమయంలో కొన్ని జంటలు కలిసుండి గొడవపడుతూ ఉంటాయి. మరికొన్ని జంటలు విడిపోయి దూరంగా ఉంటాయి. కానీ, చాలా కొంతమంది (భార్యలు కావచ్చు భర్తలు కాచవ్చు) దారణంగా ప్రవర్తిస్తూ ఉంటారు. తాజాగా ఓ వ్యక్తి తన భార్యను మాట్లాడదామురమ్మని లాడ్జికి పిలిచి కాలు నరికేశాడు. ఈ సంఘటన కర్ణాటకలోని తుముకూరులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ముధుగిరికి చెందిన అనిత(30)కు గదగ్‌కు చెందిన బాబు(34) అనే వ్యక్తితో నాలుగేళ్ల క్రితం వివాహమైంది. గొడవల కారణంగా విడాకులు తీసుకుని విడిగా ఉంటున్నారు. భార్య తనతో విడిపోయి ఉండటం ఇష్టంలేని బాబు ఆమెను చంపటానికి ప్లాన్ చేశాడు. గురువారం ఉదయం గదగ్‌నుంచి తుముకూరుకు వచ్చాడు.
అనితను మాట్లాడాలి రమ్మని తుముకూరులోని అశోక లాడ్జికి పిలిచాడు. ఇద్దరూ హోటల్‌లోనే టిఫిన్ చేశారు. ఆ తర్వాత భార్యను లాడ్జీలోని నిర్ణన ప్రదేశానికి తీసుకెళ్లాడు. తనతో పాటు వెంట తెచ్చుకున్న బ్యాగులోంచి కత్తి తీసి భార్య కాళ్లు నరికాడు. ఆమె కేకలు వేయటంతో హోటల్ సిబ్బంది అక్కడికి పరుగులు తీశారు. ఆ వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. బాబును అదుపులోకి తీసుకున్నారు. అతడ్ని విచారించగా.. తన భార్య ఇంకొకరితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందన్న కోపంతోనే ఆమెను చంపేయాలనుకున్నట్లు తెలిపాడు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : మరదలిపై కన్ను.. స్నానం చేస్తుండగా వీడియోలు తీసి..
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.