Crime News : అదనపు కట్నం తేలేదన్న బాధ.. తమపై పోలీసులకు ఫిర్యాదు చేసిందన్న కోపం.. కోడలిపై అత్యంత నీచానికి పాల్పడిందో అత్త. డబ్బు కోసం బరితెగించిన ఆమె.. కోడల్ని వ్యభిచారిని చేసింది. ఇంట్లోపడేసి బలవంతంగా ఆమెతో వ్యభిచారం చేయింది. అక్కడినుంచి ఎలాగోలా బయటపడ్డ ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పుర్ జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సుల్తాన్‌పుర్ జిల్లా, గౌరీగంజ్ తెహ్సిల్, అచల్‌పుర్ గ్రామానికి చెందిన పార్థు బసంత్‌పుర్ గ్రామానికి చెందిన సోనాలి ప్రేమించుకున్నారు. వీరి పెళ్లికి పార్థు తల్లి బాయిదేవీ ఒప్పుకోలేదు. కోరుకున్న ప్రియురాలినే తాను పెళ్లి చేసుకుంటానని అతడు తల్లికి తెగేసి చెప్పాడు. తల్లిదండ్రుల అనుమతి లేకుండానే 2018 ఫిబ్రవరి నెలలో సోనాలిని పెళ్లి చేసుకున్నాడు.
ఇక అప్పటినుంచి భార్యతో కలిసి అత్తారింటి వద్ద ఉండేవాడు. ఈ నేపథ్యంలో తమ కుమారుడు ఇష్టం లేని పెళ్లి చేసుకుని, అత్తింట్లో ఉండి తమ పరువు తీస్తున్నాడని భావించిన పార్థు తల్లిదండ్రులు ఇద్దర్నీ ఇంటికి పిలుచుకున్నారు. కొన్ని నెలలు బాగానే చూసుకున్నారు. ఆ తర్వాతినుంచి తన అసలు రంగు బయటపెట్టింది అత్త. కుమారుడు ఇంట్లో లేనపుడు సోనాలిని తిట్టేది, అతిగా పనులు చేయించేది. కుమారుడి ముందు మాత్రం ఎంతో ప్రేమ ఒలకపోస్తూ మాట్లాడేది. కొద్దిరోజుల తర్వాత ఆమె వేధింపులు మరింత పెరిగాయి. పార్థుకు కూడా సోనాలిపై లేనిపోనివి చెప్పేది. ఇంట్లో లేనిపోని ఆర్థిక ఇబ్బందులు సృష్టించి, సోనాలి కుటుంబం దగ్గరనుంచి డబ్బు తీసుకురమ్మనమని అతడికి చెప్పేది. ( ఫేర్‌వెల్ పార్టీ.. ‘‘నన్ను మోసం చేశావ్!’’ అంటూ బాలికపై.. )భర్త అడగటంతో ఆమె కాదనలేక కొన్ని సార్లు కొంత డబ్బు తెచ్చి ఇచ్చింది. కొన్ని రోజులు బాగానే ఉండి తర్వాత మళ్లీ డబ్బు కావాలని అడిగేది. తల్లి మాట కాదనలేక అడగటంతో పార్థుకు, సోనాలికి మధ్య గొడవలు మొదలయ్యాయి. గొడవ కారణంగా భార్యను కొట్టడం మొదలుపెట్టాడు. తాగుడుకు కూడా బానిసై భార్యను మరింత వేధించేవాడు. భర్త, అత్తింటి వారి వేధింపులు భరించలేక ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. ఆమె తల్లిదండ్రులు సర్థిచెప్పి వెనక్కు పంపారు. అక్కడికి వెళ్లిన తర్వాత వేధింపులు మరింత పెరిగాయి. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు భర్త, అత్తామామలకు కౌన్సిలింగ్ ఇచ్చారు.
ఈసారి ఇలా జరిగితే అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు. ఇదే సోనాలి పాలిట శాపంగా మారింది. పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన కారణంగా తమ పరువు పోయిందని భావించిన అత్త అత్యంత దారుణానికి ఒడిగట్టింది. కొన్ని రోజులు ప్రశాంతంగా ఉండి రమ్మని, పార్థును బెహ్తాలోని అతడి సోదరి ఇంటికి పంపింది. ఆ తర్వాత సోనాలిని ఇంట్లోని బెడ్‌రూంలో బంధించి, ఆమెతో వ్యభిచారం చేయించటం మొదలుపెట్టింది. సోనాలి ఎంత మొత్తుకున్నా, బ్రతిమాలినా వినలేదు. మామ బయటినుంచి విటుల్ని తెచ్చేవాడు. అత్తామామలు కలిసి మూడు రోజుల పాటు నరకం చూపించారు. అత్యంత కష్టమీద అక్కడినుంచి బయటపడ్డ ఆమె పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు భర్త, అత్తామామల్ని అరెస్ట్ చేశారు. వారిని అన్ని రకాలుగా విచారిస్తున్నారు. సోనాలిపై అత్తాంటి వారి అకృత్యాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : ఏడాది వయసున్న బిడ్డతో సహా భవనంపై నుంచి దూకిన తల్లి!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.