Chittoor Crime : ఓ అటవీ ప్రాంతంలో మహిళ అస్థిపంజరం వెలుగుచూడటం కలకలం రేపింది. పుర్రె చెట్టుకు వేలాడుతూ ఉండటం.. చూసిన వారిని షాక్‌కు గురి చేసింది. ఈ సంఘటన చిత్తూరులోని నగరిలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. డీవీఆర్ కండ్రిగ గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో మేకలు కాయటానికి వెళ్లిన కొందరు వ్యక్తులు ఆదివారం అక్కడి ఓ చెట్టుకు వేలాడుతున్న పుర్రెను చూశారు. దీంతో భయపడిపోయి అక్కడినుంచి పారిపోయారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చారు.
అక్కడికి వచ్చిన పోలీసులు చీర, డార్క్ గ్రీన్ కలర్ జాకెట్, పూసల దండను గుర్తించారు. పుర్రె కింది భాగం విడిపోయి ఉంది. ఏవైనా జంతువులు కింది భాగాన్ని లాక్కెళ్లి తిని ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. సంఘటనా స్థలంలో దొరికిన ఆధారాలను ల్యాబ్‌కు పంపారు. మహిళ చనిపోయి 50 నుంచి 60 రోజులు అయి ఉంటుందని వైద్యులు తేల్చారు. ఆమె వయసు ఎంత అనేది సరిగా నిర్థారించలేకపోతున్నారు. ఆమెది ఆత్మహత్యా?.. లేక హత్యా అన్న కోణాల్లో పోలీసులు విచారిస్తున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : తల్లిని కత్తితో పొడిచి దారుణంగా హత్య చేసిన కసాయి కొడుకు..
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.