crime news : వివాహేతర సంబంధం బయటపడుతుందనే భయంతో అన్న కొడుకును దారుణంగా హత్య చేశాడో బాబాయ్. మహిళతో కలిసి కొట్టి చంపి, ఆత్మహత్యగా చిత్రీకరించటానకి ప్రయత్నించాడు. చివరకు పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యారు ఇద్దరూ. ఈ సంఘటన చిత్తూరు జిల్లాలో ఆసల్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చిత్తూరు జిల్లా, కలికిరి మండలంలోని అద్దవారిపల్లికి చెందిన కె.సహదేవ, బంధువైన రాజేశ్వరితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. 11వ తేదీ సాయంత్రం సహదేవ, రాజేశ్వరితో కలిసి ఉండగా.. అతడి అన్న కుమారుడు ఉదయ్‌కిరణ్ చూశాడు. సహదేవ తాను ఆ మహిళతో ఉన్నట్లు ఎవ్వరితో చెప్పొద్దని బ్రతిమాలాడు.
అయితే, ఆ పిల్లాడు తల్లికి చెబుతానన్నాడు. దీంతో సహదేవకు భయం పట్టుకుంది. వివాహేతర సంబంధం విషయం బయటతెలుస్తుందని కంగారు పడ్డారు ఇద్దరూ. బాలుడి మర్మాంగంపై కర్రతో కొట్టి చంపారు. అనంతరం గ్రామ సమీపంలోని చెట్టుకు శవాన్ని ఉరి వేశారు. బాలుడు కనిపించకపోవటంతో తల్లిదండ్రులు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. మొదట మిస్సింగ్ కేసు నమోదైంది. ఊరి చివర చెట్టుకు బాలుడు ఉరి వేసుకుని కనిపించటంతో పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. ప్రత్యేక బృందాల సహాయంతో నిందితులను గుర్తించారు. సహదేవ, రాజేశ్వరిలను అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : ఓ భర్త ఆవేధన.. సూసైడ్ నోట్‌లో భార్య బంధువుల పేర్లు..
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.