అతను ఒకటి కాదు రెండు కాదు ముచ్చటగా మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఇక అంతటితో ఆగాడా అంటే అదీ లేదు. తాజాగా మరో అమ్మాయితో ప్రేమాయణం కూడా సాగించాడు. పెళ్లి కూడా సిద్దమయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న మూడో భార్య ఊహించని నిర్ణయం తీసుకుంది. అసలు ఈ ఘటన ఎక్కడ జరిగింది? ఏం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
చత్తీస్ గఢ్ లోని రాయ్ పూర్ సమీపంలోని సరోరా బస్తీ. ఇదే ప్రాంతంలో నివసిస్తున్న ఉమేష్ కుమార్ అనే వ్యక్తి గతంలో రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు. వారితో వచ్చిన విభేదాలతో విడాకులు కూడా ఇచ్చాడు. అయితే మళ్లీ మూడో పెళ్లి చేసుకుని భార్యతో సంసారం బాగానే చేశాడు. కట్ చేస్తే.. ఉమేష్ కుమార్ మరో మహిళతో ప్రేమాయణం సాగిస్తున్నాడు. ఆ యువతితో చెట్టాపట్టాలేసుకుని తెగ తిరిగేస్తున్నాడు.
ఇది కూడా చదవండి: కోడిపుంజుతో సరికొత్త నాటకం.. భర్తను హత్య చేసి పాతిపెట్టిన భార్య!
ఇక ఆ యువతితో పెళ్లి కూడా సిద్దమయ్యాడు. ఇదే విషయం మూడో భార్య చెవిన పడింది. అర్థమయ్యేటట్లు భర్తకు నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. అయినా భర్త ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. ఇక తట్టుకోలేకపోయిన మూడో భార్య కోపంతో భర్త తలపై బండరాయితో బలంగా బాదింది. ఈ దాడిలో భర్త అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. స్థానికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు భార్యపై అనుమానంతో విచారించగా అసలు విషయాలు బయటపెట్టింది. దీంతో భార్యను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఇటీవల జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్రకలకలంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.