చెన్నైలో దారుణం చోటు చేసుకుంది. అభం శుభం తెలియని ఓ మైనర్ కూతురిపై కనిపెంచిన తల్లి ఊహించని దారుణానికి పాల్పడింది. ఏకంగా తన ప్రియుడితో కూతురిపై అత్యాచారం చేయించిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చెన్నై నగరానికి చెందిన కమల అనే మహిళా ఆమెకు పెళ్లై ఇంటర్ చదివే కూతురు కూడా ఉంది. అయితే కమలకు స్థానికంగా ఉండే 50 ఉళ్ల వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని నడిపిస్తూ ఉంది.
ఇక సమయం దొరికినప్పుడల్లా ప్రియుడితో ఎంచక్కా కాలాన్ని గడుపుతూ వస్తుంది. అయితే కమలతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఆ వ్యక్తి ఆమె కూతురుపై కన్నేశాడు. దీంతో ఎలాగైన లోబరుచుకుని కోరికలు తీర్చుకోవాలని భావించాడు. ఇక అనుకున్నట్లుగానే ఆ వ్యక్తి ఇదే విషయాన్ని ప్రియురాలు కమలకు వివరించాడు. దీంతో కమల చేసేదేం లేక అతడితో కూతురుని ఇచ్చి పెళ్లి చేసేందుకు రెడీ అయింది.
ఇది కూడా చదవండి: పెళ్లికి ఓ రోజు ముందు చెరువులో శవంగా తేలిన యువతి!
కానీ ఈ పెళ్లి కూతురుకు ఇష్టం లేదు. దీంతో ఇదే అదునుగా భావించిన ఆ వ్యక్తి ఆ మైనర్ బాలికతో శారీరక కోరికలు తీర్చుకున్నాడు. అలా కొంత కాలం ఆ బాలికపై ఆ దుర్మార్గుడు లైంగిక దాడులకు పాల్పడుతుంటే తల్లి కూడా సహకరించిందట. దీంతో కొంత కాలానికి ఆ బాలిక గర్భవతి అని తేలింది.ఇదే విషయంపై ఇరుగు పొరుగు వ్యక్తులు ప్రశ్నించగా తన కూతురికి పెళ్లి చేశానంటూ తెలిపింది.
ఇక ఇటీవల ఆ బాలిక ఓ బిడ్డకు సైతం జన్మనిచ్చింది. ఈ విషయం తెలిసిన శిశు సంక్షేమ కమిటీ.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు తల్లితో పాటు ఆమె ప్రియుడిని కూడా అరెస్ట్ చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.