రిమి సేన్.. పరిచయం అక్కర్లేని హీరోయిన్. తన అందం, అభినయంతో కుర్రకారును తన వైపు లాగేసుకుంది. ధూమ్ 2, గోల్‌మాల్, బాగ్‌బాన్, హంగామా వంటి సినిమాల్లో మెప్పించిన ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లో కూడా నటించి ఏకంగా మెగాస్టార్ చిరంజీవితోనే నటించే అవకాశాన్నిదక్కించింది. చిరింజీవి నటించిన అందరివాడు సినిమాలో ఈ ముద్దుగుమ్మ నటించింది.
అయితే అప్పట్లో నటనతో మెప్పించిన ఈ అందాల బామ ప్రస్తుతం పోలీస్ స్టేషన్ ల చుట్టు తిరుగుతోంది. అసలు విషయం ఏంటంటే? రిమి సేన్ కు మూడేళ్ల క్రితం వ్యాపారవేత్త రౌనక్ జతిన్ వ్యాస్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. వీరిద్దరి పరిచయం కాస్త స్నేహం గా మారడంతో రౌనాక్, తన వ్యాపారం గురించి రిమి కి చెప్పేవాడు. కొత్త వెంచర్ స్టార్ట్ చేస్తున్నామని, నువ్వు కూడా భాగస్వామిగా మారితే లాభాలు వస్తాయని నమ్మబలికాడు.
ఇది కూడా చదవండి: పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన Jr NTR.. ఏమన్నారంటే!
స్నేహితుడే కదా నమ్మిన రిమి, అతడికి పెట్టుబడి కింద ఏకంగా రూ. 4.14 కోట్లు దారపోసింది. ఇక కొన్ని రోజుల తర్వాత అతడు కనిపించడం లేదని, అతడి గురించి ఆరా తెస్తే అస్సలు అతను ఏ వ్యాపారం ప్రారంభించలేదని తెలిపింది. చివరికి తాను మోసపోయానని గ్రహించినట్లు తెలుసుకున్న హీరోయిన్ ఏం చేయాలో తెలియక చివరికి పోలీసులను ఆశ్రయించింది. ఎలాగైన అతడిని పట్టుకుని నా డబ్బులు నాకు ఇప్పించాలని రిమి పోలీసులను కోరుతోంది.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.