బిహార్, బంకా జిల్లా.. అమర్పూర్ గ్రామం..
మిట్ట మధ్యాహ్నం గ్రామంలో పంచాయతీలు జరిగే చోట భారీగా జనం గుమికూడి ఉన్నారు. 30 ఏళ్ల సుఖ్‌దేవ్ కాపురానికి సంబంధించిన పంచాయతీ జరుగుతోంది అక్కడ. పంచాయతీ ముగింపుకు కూడా వచ్చింది.
‘‘ సుఖ్‌దేవ్! నీ ఆఖరి మాట ఏంటో చెప్పు.. నీ భార్యతో ఉంటావా?.. వేరే పెళ్లి చేసుకుంటావా?..’’ అడిగాడు ఊరిపెద్ద.
సుఖ్‌దేవ్ కన్నీళ్లు నిండిన కళ్లతో, బరువెక్కిన గుండెతో భార్య రేఖ వైపు చూశాడు. అతడు కళ్లలోకి కళ్లు పెట్టి చూడగానే ఆమె తల దించుకుంది. అతడు ఆమె వైపు చూస్తూ ఉన్నాడు. ఆమె పెద్ద తప్పు చేసింది. అది తప్పు అని అనటం కంటే ద్రోహం, పాపం అనటం ఉత్తమం. గుడ్డిగా నమ్మిన పాపానికి, భార్యను ఉన్నతమైన స్థితిలో చూడాలనుకున్న నేరానికి తనకు ఈ శాస్తి జరగాల్సిందే అనుకున్నాడు.
………….
అమర్పూర్కు చెందిన సుఖ్‌దేవ్‌కు బరాహట్ గ్రామానికి చెందిన రేఖతో 5 ఏళ్ల క్రితం వివాహమైంది. ఆమెను ఏరికోరి చేసుకున్నాడతను. మూడు ముళ్లు పడ్డనాటినుంచే భార్య సర్వశ్వంగా మారింది. క్షణం కూడా ఆమెను వదిలిపెట్టి ఉండలేనట్లు తయారైంది అతని పరిస్థితి. ఓ ఆరునెలల తర్వాత భార్యకు చదువంటే ఇష్టం అని తెలుసుకున్నాడు. 10 వరకు చదివిన ఆమె ఆపై చదువులు చదవాలనుకుంటోందని తెలిసి సంతోషించాడు. అయితే, కూలీ పని చేసుకునే అతడికి ఆమెను చదివించటం శక్తికి మించిన పని.
ఆమెకు ఇష్టమైన వన్నీ తన ఇష్టాలుగా మార్చుకుంటున్న అతడికి ఆ కష్టం పెద్దదిగా అనిపించలేదు. తను ఎలాగో చదువుకోలేదు. భార్యనైనా చదివిద్దాం అనుకున్నాడు. అలా ఇలా కాదు.. రాష్ట్రం మొత్తం గర్వించేలా భార్యను కలెక్టర్ చేయాలనుకున్నాడు. భార్యను ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ చేర్పించాడు. పొద్దున ఇంటినుంచి పోయి సాయంత్రం ఇంటికి వచ్చేదామె. కూలీకి పనికి పోయిన వచ్చిన అతడు భార్య కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూసేవాడు. ఆరోజు పనిలో పడ్డ కష్టమంతా భార్యను చూడగానే ఏదో మాయ చేసినట్లు మర్చిపోయేవాడు.
రోజులు గడుస్తున్నాయి. ఆమె మంచి మార్కులతోనే ఇంటర్ పాసైంది. తర్వాత యూపీఎస్సీ పరీక్ష కోసం కోచింగ్ సెంటర్లో చేరిందామె. ఆ కోచింగ్ సెంటర్ ఆ ప్రాంతంలో చాలా ఫేమస్.. అందుకు తగ్గట్టుగానే ఫీజులు కూడా ఉండేవి. భార్యను కోచింగ్ సెంటర్లో చేర్పించడానికి రూ. 10 వడ్డీతో అప్పు చేశాడు. ఆ అప్పు తీర్చటానికి ప్రతి రోజూ ఓవర్ టైం చేయాల్సిన పరిస్థితి. భార్య కోసం అన్ని కష్టాలను భరించేవాడు. ఓ రోజు భార్య ఫోన్ ఇంట్లో మర్చిపోయి పోయింది. ఆ ఫోన్‌ను కొనడానికి కూడా అతడు ఎంతో కష్టపడ్డాడు. ఎన్నో నిద్రలేని రాత్రుళు గడిపి మరీ ముద్దుల భార్యకు ఫోన్‌ను కొనిచ్చాడు.
తన ఫోన్ కంటే ఆ ఫోన్ చాలా రేట్ ఎక్కువ. మంచి ఫీచర్స్ ఉన్న ఫోన్ కూడా. సాయంత్రం పనికి పోయివచ్చిన తర్వాత ఫోన్ వచ్చింది. ఎత్తుదాము అనుకునే లోపు కట్ అయింది. ఫోన్‌ను చేతుల్లోకి తీసుకున్నాడు. చాలా మిస్స్డు కాల్స్ ఉన్నాయి. ఆ నెంబర్‌కు ఫోన్ చేసి హలో అన్నాడు. అవతలినుంచి రిప్లై రాలేదు. ఓ రెండు సార్లు పిలిచి కట్‌చేశాడు. సెల్ ఫోన్ నోటిఫికేషన్ బార్లో వాట్సాప్ మెసేజ్‌లు కనిపించటంతో అలవాటుగా నొక్కాడు. చాలా మెసేజ్‌లు.. వాయిస్ మెసేజ్‌లు ఉన్నాయి. అవన్నీ ఓ కొత్త నెంబర్నుంచి వచ్చాయి. వాయిస్ మెసేజ్‌లు నొక్కి విన్నాడు. భార్యను బూతులు తిడుతూ ఓ వ్యక్తి చేసిన మెసేజ్‌లు అవి.. తట్టుకోలేకపోయాడు. వెంటనే ఆ నెంబర్‌కు ఫోన్ చేశాడు. ఆ వ్యక్తిని గట్టిగా నిలదీశాడు. అప్పుడు తెలిశాయి..మతి పోయే విషయాలు..
…………
యూపీఎస్సీ పరీక్ష కోసం కోచింగ్ తీసుకుంటున్న కొద్దిరోజులకే రేఖకు, కన్నయ్యలాల్‌తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కొద్దిరోజులకే వివాహేతర సంబంధానికి దారి తీసింది. వీలైనన్ని సార్లు కలుస్తూ ఉండేవారు. అతడితో ఉన్నపుడు లేటయితే కోచింగ్ సెంటర్లో లేటయిందని అబద్ధం చెప్పేది. రోజులు గడుస్తూ ఉన్నాయి. ఇద్దరి మధ్యా ఏదో విషయంలో గొడవైంది. అప్పటినుంచి అతడికి దూరంగా ఉంటూ వచ్చిందామె. ఈ సమయంలోనే రాకేష్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కూడా వివాహేతర సంబంధానికి దారి తీసింది.
కన్నయ్య ముందే ఇద్దరు క్లోజ్‌గా ఉండేవారు. బైకులపై తిరిగేవారు. ఇది చూసిన కన్నయ్య తట్టుకోలేకపోయాడు. చాలా సార్లు ఆమెను అడ్డగించి తిట్టాడు. రాకేష్‌తో తిరగటం మానేయాలని, లేకపోతే భర్తకు చెప్తానని బెదిరించాడు. కానీ, ఆమె మాట వినలేదు. కన్నయ్యనుంచి తప్పించుకుని తిరిగేది. ఫోన్ చేస్తే ఎత్తేది కాదు. నెంబర్‌ను కూడా బ్లాక్‌లో పెట్టింది. జరిగిందంతా పూస గుచ్చినట్లు సుఖ్‌దేవ్‌కు చెప్పాడు కన్నయ్య. అతడు నమ్మలేదు. భార్య ఏ తప్పు చేయలేదని అన్నాడు. కన్నయ్య తన ఫోన్లో వారిద్దరూ తీసుకున్న, రాకేష్‌తో ఆమె క్లోజ్‌గా ఉన్న ఫోటోలు పంపాడు. అవి చూసి సుఖ్‌దేవ్ అల్లాడిపోయాడు. ప్రాణం పోయినట్లు అనిపించింది.
భార్య ఇంటికి రాగానే ఫొటోలు చూపించి నిలదీశాడు. రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోవటంతో తప్పు అయిపోయిందని ఇకపై అలా జరగదని బ్రతిమాలింది. భార్య మీద ప్రేమతో అతడు ఆమెను ఏమీ అనకుండా వదిలేశాడు. అయితే, ఆమెలో ఎలాంటి మార్పు రాలేదు. మళ్లీ అదే దోవలో పోతుందని కన్నయ్య ద్వారా తెలుసుకున్నాడు. ఈ సారి పెద్దల దగ్గర పంచాయతీ పెట్టించాడు. భార్య చేసింది తప్పని తెలుసుకున్న పెద్ద మనుషులు.. నిర్ణయాధికారం సుఖ్దేవ్కే వదిలేశారు. ఈ సారి తప్పు చేశావని తెలిస్తే ఊరు కట్టుబాటు ప్రకారం కఠినంగా శిక్షిస్తామన్నారు.
ఆమె చేసిన తప్పుకు వేరే మగాడైతే చంపి, ఉప్పుపాతర వేసేవాడే. కానీ, తనకు మాత్రం అలా చేయాలని లేదు. భార్య తప్పు చేసిందని.. కాదు.. కాదు.. తీరని ద్రోహం చేసిందని తెలిసినా ఆమె మీద కోపం కలగటం లేదు. విడిచి ఉండాలని అనిపించటం లేదు. మళ్లీ ఆమెను ఏలుకోవటానకి ఒప్పుకున్నాడు. భార్య తప్పు చేసిందని తెలిసినా ఆమెను మళ్లీ తన జీవితంలోకి ఆహ్వానించిన సుఖ్‌దేవ్ మనసుకు జనం జైజైలు కొడుతున్నారు. మంచి మనసున్న భర్తను ఎలా మోసం చేయాలనిపించింది అంటూ రేఖపై ఫైర్ అవుతున్నారు. మరి ఈ భార్యభర్తలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : తల్లిని కత్తితో పొడిచి దారుణంగా హత్య చేసిన కసాయి కొడుకు..
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.