మెడలో తాళికట్టిన భర్తతో ప్రాణం పోయేంత వరకూ తోడుగా ఉండాలని ప్రతీ భార్య ఆరాటపడుతుంది. దీంతో భర్తే సర్వస్వం అంటూ పెళ్లైన ప్రతీ మహిళ అనుకుంటూ జీవిస్తుంది. ఇలా ఎన్నో ఆశలతో అత్తిరింట్లో అడుగు పెట్టిన ఓ ఇల్లాలును భర్త అందంగా లేవంటూ వేధించాడు. ఇంతటితో ఆగకుండా అనేక వేధింపులకు గురి చేస్తూ చివరికి భార్యను దారుణంగా హత్య చేశాడు. తాజాగా అనంతపురం జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఉమ్మడి అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలోని బ్రహ్మయ్యగుడి గ్రామం.
కుళ్లాయప్ప అనే వ్యక్తి స్థానికంగా కూలీ పనులు చేస్తూ జీవనాన్ని సాగించేవాడు. అయితే కుళ్లాయప్ప ఆరేళ్ల క్రితం ఇదే ప్రాంతానికి చెందిన అపర్ణను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెద్దలు అంగీకరించకపోయినా ఎదిరించి మరీ ఆమె మెడలో తాళి కట్టాడు. వీరికి ఇద్దరు సంతానం. అయితే పెళ్లైన కొన్నాళ్లు కుళ్లాయప్ప భార్యతో సంతోషమైన జీవితాన్ని గడిపాడు. కొంత కాలం తర్వాత కుళ్లాయప్ప మద్యానికి బానిసయ్యాడు. దీంతో భార్యను అందంగా లేవంటూ వేధించాడు. కొన్నాళ్లు భరించిన భార్య.. భర్త వేధింపులు ఎక్కువవ్వడంతో తట్టుకోలేపోయింది.
ఇది కూడా చదవండి: Chandrayangutta: రాష్ట్రాలు వేరైన ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. ఇంట్లో ఎవరూ లేని టైమ్ చూసిన భార్య!
భర్తతో ఉండలేక విడాకులు తీసుకుంటానంటూ పెద్దలకు తెలిపింది. తన పరువు తీసిందని భర్త కుళ్లాయప్ప కోపంతో ఊగిపోయాడు. ఇటీవల అతిగా మద్యం సేవించి రాత్రి ఇంటికొచ్చి భార్యతో గొడవ పెట్టుకున్నాడు. దీంతో ఇద్దరి మధ్య వివాదం జరిగింది. ఈ నేపథ్యంలో క్షణికావేశంలో కుళ్లాయప్ప కత్తితో భార్యను దారుణంగా హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో వెంటనే స్పందించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.