మహిళలపై జరుగుతున్న నేరాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా.. మృగాళ్ల వైఖరిలో ఏ మాత్రం మార్పు రావడం లేదు. నిత్యం ఏదో ఓ చోట మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడటం, వేదించడం, బెదిరించడం చేస్తూనే ఉన్నారు. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది. గ్రామ వాలంటీర్ ఒకరు ప్రియురాలి నగ్న చిత్రాలు ఆమె తండ్రికి పంపి బెదిరింపులకు పాల్పడ్డాడు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం ముషిడిపల్లి గ్రామ సచివాలయంలో శీరెడ్డి నవీన్ ఇంజినీరింగ్ సహాయకుడిగా పనిచేస్తున్నాడు. అదే సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగినితో రెండేళ్లుగా ప్రేమాయణం సాగించాడు. ఇద్దరిదీ ఒకటే సామాజికవర్గం కావడంతో ఇరు కుటుంబాలూ పెళ్లికి అంగీకరించాయి. అయితే.. రెండు నెలల కిందట ఇద్దరి మధ్య మనస్పర్ధలొచ్చాయి. అప్పటినుంచి ఇద్దరు కొంచెం దూరం దూరంగానే ఉంటున్నారు.
ఇది కూడా చదవండి: Rajasthan: పరీక్ష రాసి వస్తున్న12 ఏళ్ల బాలిక కిడ్నాప్.. రెండ్రోజుల పాటు గ్యాంగ్ రేప్!
నవీన్ ఇల్లు కడుతున్నానని, ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానని.. నిర్మాణానికి కొంత డబ్బు కావాలని యువతి తల్లిదండ్రులను అడిగాడు. డబ్బు ఇవ్వలేమని యువతి తల్లిదండ్రులు చెప్పారు. దీంతో యువతి నగ్న చిత్రాలను ఆమె తండ్రి మొబైల్‌కు పంపి.. వాటిని సామాజిక మాధ్యమాల్లో పెడతానంటూ నవీన్ బెదిరించాడు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించగా నిందితుడిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.