crime news : అత్తింటి వారి వేధింపులు భరించలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లాలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పాలకొండ గారమ్మ కాలనీకి చెందిన ప్రియాంక, టెక్కటి పట్టణానికి చెందిన సొదె కిరణ్‌కు 2019లో వివాహం అయింది. 2020లో ప్రియాంకకు తొలి కాన్పులో ఇద్దరు ఆడపిల్లలు జన్మించారు. తాజాగా, రెండో కాన్పులో మరో ఆడపిల్ల పుట్టింది. రెండు కాన్పుల్లోనూ ఆడపిల్లలు పుట్టడంతో అత్తింటివారు ఆగ్రహం వ్యక్తం చేశారు. భర్తతో పాటు మిగిలిన కుటుంబసభ్యులు వేధింపులకు గురిచేయటం మొదలుపెట్టారు. ముగ్గురు ఆడపిల్లల్ని పెంచేందుకు పుట్టింటినుంచి డబ్బులు తేవాలంటూ ఇబ్బంది పెట్టేవారు. దీంతో ప్రియాంక తట్టుకోలేకపోయింది. ఆ ఇంట్లో ఉండలేక కొద్దిరోజుల క్రితం పుట్టింటికి వచ్చింది.
బుధవారం తల్లి, సోదరి పనులకు పోయిన తర్వాత ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మధ్యాహ్నం ఇంటికి వచ్చిన ప్రియాంక చెల్లెలు గాయత్రి తలుపులు తెరిచి లోపలికి వెళ్లింది. ఇంట్లోని మరో గది లోపల పాప అరుపులు వినిపిస్తూ ఉన్నాయి. పాప ఏడుస్తున్నా అక్క ఎందుకు పట్టించుకోవటం లేదు అనుకుని గది తలుపులు తెరిచింది. లోపల ప్రియాంక ఉరికి వేలాడుతూ కనిపించింది. కింద కాళ్లను పట్టుకుని పాప ఏడుస్తూ ఉంది. ఈ హృదయవిదారక ఘటనకు ఆమె గుండె బద్ధలైంది. వెంటనే తల్లికి, చుట్టుప్రక్కల వాళ్లకు సమాచారం అందించింది. వారు కూడా అక్కడకు చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతురాలి సూసైడ్ నోట్ ఆధారంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : అల్లుడ్ని హత్య చేసిన అత్తామామలు.. ఇంట్లోంచి వాసన రావటంతో..
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.