Ahmedabad Crime : దేశంలో కామాంధుల అరాచకాలు ఎక్కువయిపోతున్నాయి. చిన్నా,పెద్ద తేడాలేకుండా ఆడ వారిపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా, ఓ కామాంధుడు ఆడపిల్లల ముందు బట్టలు లేకుండా రౌండ్లు వేశాడు. అడిగిన పిల్లల తల్లిదండ్రులతో గొడవకు దిగాడు. ఈ సంఘటన గుజరాత్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గుజరాత్, అహ్మాదాబాద్ జిల్లాకు చెందిన చందు సంఘావత్‌కు 40 ఏళ్లు. అంత వయసు వచ్చినా అతడికి బుద్ధి మాత్రం పెరగలేదు. కామంతో కళ్లు మూసుకుపోయి సైకోలాగా తయారయ్యాడు. కొద్దిరోజుల క్రితం పొరిగింటికి చెందిన ఇద్దరు ఆడ పిల్లలు ఇంటి బయట గ్రౌండ్‌లో ఆడుకుంటూ ఉన్నారు.
ఈ నేపథ్యంలో చందు బట్టలు విప్పేసి నగ్నంగా బయటకు వచ్చాడు. బాలికలు ఆడుకుంటున్న చోట తిరగటం మొదలుపెట్టారు. ఇది గమనించిన పిల్లల తల్లిదండ్రులు అతడి దగ్గరకు వచ్చారు. బట్టలు వేసుకోవాలని కోరారు. ఇకపై బుద్ధిగా ఉండాలని హెచ్చరించారు. తనను అడ్డగించటంతో చందు రెచ్చిపోయాడు. తన జోలికి వస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించాడు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : తల్లిని కత్తితో పొడిచి దారుణంగా హత్య చేసిన కసాయి కొడుకు..
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.