Crime News: ప్రియురాళ్ల మోజులో పడి ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. కడుపుతో ఉన్న భార్యను కత్తితో పొడిచి చంపేశాడు. ప్రియురాళ్ల ముందే ఈ హత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఉత్తర ప్రదేశ్, ఆగ్రాలోని తజ్‌నాగారికి చెందిన ఉమాంగ్ చౌదరికి అందే ప్రాంతానికి చెందిన ప్రీతితో డిసెంబర్ 11న వివాహం అయింది. ఉమాంగ్ దయాల్ బాగ్‌లో కార్ల వాషింగ్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. ఆదివారం పని అయిపోగానే ఇంటికి వెళ్లాడు. ఇంట్లో మద్యం సేవించాడు. కొద్ది సేపటి తర్వాత అతడి ఇద్దరు ప్రియురాళ్లు అక్కడికి వచ్చారు. ఉమాంగ్ వారితో పీచ్చాపాటి మాట్లాడుతూ ఉన్నాడు.
భర్తకు వేరే ఇద్దరు అమ్మాయిలతో సంబంధం ఉన్నట్లు ప్రీతికి తెలుసు. ఆ ఇద్దరు ఉమాంగ్ కోసం ప్రీతితో తరచూ గొడవపడేవారు. ఈ నేపథ్యంలో భర్తకు ఎన్నో సార్లు నచ్చచెప్పింది. అతడు వినలేదు. ఇప్పుడు నేరుగా ఇంటికి తీసుకురావటంతో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ అమ్మాయిలతో మాట్లాడవద్దని అతడ్ని కోప్పడింది. ఈ నేపథ్యంలో తీవ్ర ఆగ్రహానికి గురైన ఉమాంగ్ తన ఇద్దరు ప్రియురాళ్ల కోసం భార్య అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు. ప్రియురాళ్ల ముందే కత్తితో ఆమె గొంతు కోశాడు. గొంతు తెగటంతో ఆమె అక్కడికక్కడికే మృతి చెందింది. అతడు ఆమె శవం పక్కనే కూర్చుండిపోయాడు.
ఆ ఇద్దరు అమ్మాయిలు భయంతో బయటకు వెళ్లకుండా అక్కడే ఉండిపోయారు. ఉదయం ప్రీతి చనిపోయినట్లు గుర్తించిన ఉమాంగ్ కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రీతి శవం దగ్గర తన కుమారుడు షర్టుపై రక్తం మరకలతో కూర్చుని ఉన్నాడని ఉమాంగ్ తండ్రి పోలీసుల విచారణలో తెలిపాడు. ఆ రూంలో ఇద్దరు యువతులు కూడా ఉన్నారని చెప్పాడు. ప్రీతి ప్రస్తుతం రెండున్నర నెలల గర్భంతో ఉందని వెల్లడించారు. పోలీసులు ఉమాంగ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Vizag Srujana Case: వైజాగ్ సృజన ఆత్మహత్య.. ఈ పాపం ఎవరిది?