మారుతున్న కాలానికి అనుగుణంగా సోషల్ మీడియా ప్రపంచం కొత్త పుంతలు తొక్కుతోంది. అయితే దీని వల్ల ఎంత ఉపయోగం ఉందో అంతకంటే ఎక్కువ ప్రమాదం కూడా పొంచి ఉంది. కాగా నేటి కాలం యువత ఎక్కువగా సోషల్ మీడియా ప్రపంచంలో మునిగి తేలుతూ వేధింపులకు పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి వేధింపుల బలైన ఓ 10 తరగతి విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.
ఇక పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లాలోని ఇచ్చోడ మండలం నర్సాపూర్ గ్రామం. ఇదే గ్రామంలో ముస్లే సాక్షి అనే 10వ తరగతి తల్లిదండ్రులతో పాటు నివాసం ఉంటుంది. ఎంతో సంతోషంగా సాగుతున్న ఆ బాలిక జీవితంలోకి ఒక్కసారిగా సోషల్ మీడియా నుంచి నకిలీ ఐడీలతో వేధింపులు ఎదురయ్యాయి. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తన పేరు మీద నకిలీ ఐడీలు సృష్టించి అసభ్యకరమైన సందేశాలు పంపించడం మొదలు పెట్టారు.
ఇది కూడా చదవండి: Peddapalli: అన్నం పెడతానని తీసుకెళ్లి.. తొమ్మిదేళ్ల బాలికపై 44ఏళ్ల వ్యక్తి అత్యాచారం!
కొంత కాలం సైలెంట్ గా ఉన్న యువతికి వేధింపులు రోజు రోజుకు మరింత ఎక్కువయ్యాయి. పోకిరీల వేధింపులకు ముస్లే సాక్షి తీవ్ర మనస్థాపానికి గురైంది. గత రెండు రోజుల కిందట ఆ బాలిక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఇక ఆత్మహత్యకు ముందు నకిలీ ఐడీలతో నన్ను వేధింపులకు గురి చేసిన ఆ వ్యక్తులను గుర్తించి కఠినంగా శిక్షించాలని.. ఐ వాంట్ జస్టీస్ అంటూ బాలిక లేఖలో తెలిపింది.
కూతురు ఆత్మహత్యపై తండ్రి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నా కూతురిని వేధింపులకు గురి చేసిన దుర్మార్గులను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశాడు. ఇక తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.