సినీ ప్రపంచంలో ఒక్క ఛాన్స్ వస్తే చాలు.. సమాజంలో స్టార్ హొదా లభిస్తుంది. ఇండస్ట్రీ ఎప్పుడూ ఒకేలా ఉండదు.. ఎంతో స్టార్ హోదా ను చూసిన వారు కూడా చాలా తక్కువ సమయంలోనే ఒక్కసారిగా పాతాళానికి పడిపోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే ఓ సినీ నటి ఎవరూ ఊహించని విధంగా తన స్థాయి మరచి చిల్లర దొంగతనం చేస్తూ పోలీసులకు అడ్డంగా బుక్కయ్యింది. కోల్‌కతా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో చోరీ చేస్తూ ఓ టీవీ నటి పోలీసులకు చిక్కింది. దీంతో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. బెంగాలీకి చెందిన నటి రూపా దత్తా. పలు టీవీ సిరీయల్స్‌లో నటించింది. ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో ఖాళీ వ్యాలెట్‌లను చెత్తబుట్టలో పారేస్తూ ఆమె భద్రతా సిబ్బందికి కనిపించింది.
ఖరీదైన బ్యాగ్ ని అలా ఎందుకు పడేస్తుంది అని అనుమానంతో ఆరా తీయగా అందులో చాలా పర్సలు బయటపడ్డాయి. దాదాపు రూప నుంచి 75 వేల రూపాయల వరకు పోలీసులు రికవరీ చేసినట్లు తెలుస్తోంది. నగదుతో పాటు ఓ డైరీ లభించిందని పోలీసులు చెప్పారు. అందులో ఆశ్చర్యకర విషయాలు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. కోల్‌కతాలోని రద్దీ ప్రదేశాల పేర్లు, గతంలో అనేక సార్లు చోరీ చేసిన ప్రాంతాల పేర్లు రూపా తన డైరీలో రాసుకున్నట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆమెపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసును నమోదు చేశారు.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.