Crime Story: మే 3, 2022
అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కొత్తగూడెం గ్రామ శివారు ప్రాంతం. జాతీయ రహదారి పక్కన ఉన్న నిర్మానుష ప్రదేశంలో రెండు శవాలు పడి ఉన్నాయని పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు హుటాహుటిన ఆ ప్రాంతానికి వెళ్లారు. వారు ఊహించిన దాని కంటే దారుణంగా ఉంది అక్కడి పరిస్థితి. ఓ మహిళ, యువకుడి మృతదేహాలు నగ్నంగా పడి ఉన్నాయి. వాటి ముఖాలు దారుణంగా చిధ్రం చేసి ఉన్నాయి. యువకుడి పురుషాంగం కూడా దారుణంగా చిధ్రం చేయబడి ఉంది. సంఘటన స్థలంలో బ్యాగు, చార్జింగ్ లైట్లు, ప్లాస్టిక్‌పూలు, మొబైల్ చార్జర్‌తో పాటు కూల్‌డ్రింక్ సీసాలు లభ్యమయ్యాయి. సంఘటనా స్థలానికి కొద్ది దూరంలోనే ఓ బైక్ పార్కింగ్ చేసి ఉంది. పోలీసులకు కొంచెం క్లారిటీ వచ్చింది. అవి వివాహేతర సంబంధం కారణంగా జరిగిన జంట హత్యలుగా అనుమానించారు.
కానీ, ఎవరు ఈ ఇద్దరు? ఎందుకు ఇక్కడికి వచ్చారు? ఒక వేళ శృంగారం కోసం వచ్చుంటారు అనుకుంటే.. వీరిని చంపింది ఎవరు?.. తెలిసిన వాళ్లే చంపారా? ఇద్దరు ఏకాంతంగా ఉండగా వేరే వ్యక్తులు చూసి, ఆమెపై అత్యచారం చేసి చంపారా?.. ఇలా సవా లక్ష అనుమానాలు వారిని వెంటాడుతున్నాయి. క్లూస్ టీం ఆధారాలు సేకరించింది. బైక్ నెంబర్ ప్లేటు ఆధారంగా యువకుడ్ని 22 ఏళ్ల యశ్వంత్‌గా గుర్తించారు. ఆ తర్వాత లభించిన ఆధారాలతో మృతురాలిని 35 ఏళ్ల జ్యోతిగా గుర్తించారు. వీరిద్దరి చావుకు మొదట అనుకున్నట్లుగా వివాహేతర సంబంధమే కారణమని తేలింది. మరి, ఆ హత్య ఎవరు చేశారు?.. పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు వేగవంతం చేశారు. సంఘటనా స్థలంలో దొరికిన జ్యోతి హ్యాండ్ బ్యాగులో ఉన్న ఓ చెప్పుల షాపు రిసిప్ట్ ఆధారంగా దర్యాప్తు మొదలుపెట్టారు. శ్రీనివాస్ అనే వ్యక్తి పేరు వెలుగులోకి వచ్చింది.
విచారణలో శ్రీనివాస్‌ను జ్యోతి స్నేహితుడిగా గుర్తించారు. పోలీసులు అతడ్ని విచారించగా జ్యోతి, యశ్వంత్ వివాహేతర సంబంధం నచ్చని భర్తే ఈ పని చేసుండొచ్చని చెప్పాడు. అతడు జ్యోతి భర్త 49 ఏళ్ల శ్రీనివాసరావు ఫోన్ నెంబర్ ఇచ్చాడు. పోలీసులకు శ్రీనివాసరావు మీద అనుమానం మొదలైంది. ఎందుకంటే.. భార్య కనిపించకుండా పోయి మూడు రోజులు అవుతున్నా అతడు పట్టించుకోలేదు. పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కంప్లైంట్ కూడా ఇవ్వలేదు. దీంతో పోలీసులు శ్రీనివాసరావు ఫోన్ లోకేషన్ ఆధారంగా అతడు విజయవాడలో ఉన్నట్లు గుర్తించారు. బుధవారం అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. అతడ్ని విచారించిన పోలీసులకు విస్తుపోయే విషయాలు తెలిశాయి.
విజయవాడకు చెందిన శ్రీనివాసరావు భార్య 18 ఏళ్ల క్రితం చనిపోయింది. అప్పటికే విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటున్న సత్యవతి అలియాస్ జ్యోతిని పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు మగ పిల్లలు. శ్రీనివాసరావు, జ్యోతిలు ఉపాధి కోసం హైదరాబాద్ వచ్చి వారాసిగూడలో ఉంటున్నారు. అక్కడ క్యాబ్ డ్రైవర్ యశ్వంత్‌తో జ్యోతికి పరిచయమైంది. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. కొన్ని రోజుల క్రితమే ఈ విషయం శ్రీనివాసరావుకు తెలిసింది. దీంతో అతడు భార్యను మందలించాడు. అయినా ఆమెలో మార్పు రాలేదు. ఈ నేపథ్యంలో యశ్వంత్‌ను చంపేందుకు పథకం వేశాడు. కానీ, అది అమలు చేయటం సాధ్యపడలేదు. భార్యలో మార్పు రాకపోవటంతో విజయవాడకు తిరిగి వెళ్లిపోవాలని నిశ్చయించుకున్నాడు శ్రీనివాసరావు. మే 1 ఇళ్లు ఖాళీ చేసి సామాన్లు విజయవాడకు పంపేశాడు.
మే 1, సాయంత్రం
విజయవాడకు వెళ్లిపోతున్న నేపథ్యంలో చివరిసారి ప్రియుడ్ని కలుస్తానని జ్యోతి భర్తను కోరింది. సరైన అవకాశం కోసం ఎదురుచూస్తున్న శ్రీనివాసరావు అందుకు ఒప్పుకున్నాడు. జ్యోతితో యశ్వంత్‌కు ఫోన్ చేసి పిలిపించాడు. ముగ్గురు కలిసి వారాసిగూడనుంచి రెండు బైకులమీద విజయవాడ బయలుదేరారు. ఎల్బీనగర్ దగ్గర మందు, కూల్‌డ్రింక్స్, బిర్యానీ కొనుక్కున్నారు. రాత్రి 11 గంటలకు కొత్తగూడ సమీపంలోని నిర్మానుష ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ శ్రీనివాసరావు మద్యం తాగుతుండగా.. కొంతదూరంలో జ్యోతి, యశ్వంత్ శృంగారంలో మునిగిపోయి ఉన్నారు. వారిద్దరినీ నగ్నంగా శృంగారం చేస్తూ ఉండగా చూడటం శ్రీనివాసరావు భరించలేకపోయాడు. అతడిలోని రాక్షసుడు బయటకు వచ్చాడు. తన వాహనంలోని సుత్తి, స్క్రూ డ్రైవర్ తీసుకుని వారి దగ్గరకు వచ్చాడు. సుత్తితో ఇద్దరి తలలపై బలమైన వేట్లు వేశాడు. ఆ దెబ్బలకు వాళ్లు తేరుకోలేకపోయారు. తర్వాత స్క్రూడ్రైవర్‌తో విచక్షణారహితంగా యశ్వంత్‌ను పొడిచాడు. యశ్వంత్ పురుషాంగాన్ని కూడా చిధ్రం చేశాడు. తర్వాత పెద్ద బండరాయితో జ్యోతి తలను బాదాడు. అనంతరం ఆమె ఫోన్ తీసుకుని తన వాహనంలో విజయవాడ వెళ్లిపోయాడు.
డబ్బు, పదవి, ఆస్తి, అంతస్తుల కంటే హ్యూమన్ ఎమోషన్స్ చాలా విలువైనవి.. ప్రమాదకరమైనవి. ఇదే కాదు! చాలా కేసుల్లో ఈ ఎమోషన్సే ఘోరాలకు దారి తీస్తున్నాయి. శ్రీనివాసరావు తన భార్య జ్యోతి తనకు మాత్రమే సొంతం అనుకున్నాడు. జ్యోతి, శ్రీనివాసరావులో లేని దేన్నో యశ్వంత్‌లో కోరుకుంది. యశ్వంత్ పెళ్లైన మహిళతో శృంగారం సంతోషంగా ఉందనుకుని ఉండొచ్చు. ఏది ఏమైనప్పటికి రెండు ప్రాణాలు బలయ్యాయి. మరి, ఈ కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Sathya Sai: ప్రియుడి కోసం వెళ్లి.. రేకుల షెడ్డులో శవమై తేలింది..