45 weds 25 : అతడికి 45 ఏళ్లు.. ఇంకా పెళ్లి కాలేదు. పెళ్లి కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూసి చివరకు దాని మీద ఆశలు వదలుకున్నాడు. ఆ టైంలో 25 ఏళ్ల ఓ అమ్మాయి అతడి జీవితంలోకి వచ్చింది. ఇద్దరి మధ్యా ప్రేమ చిగురించింది. పెళ్లి కూడా చేసుకున్నారు. ఆ పెళ్లి దేశ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఏ దిష్టి తగిలిందో ఏమో పాపం.. కాపురంలో గొడవలు మొదలయ్యాయి. ఆ 25 ఏళ్ల భార్య, 45 ఏళ్ల భర్త మనసును అర్థం చేసుకోలేకపోయింది. తట్టుకోలేక చివరకు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన కర్ణాటకలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కర్ణాటకలోని తుముకూరు జిల్లా, అక్కిమరిద్యకు చెందిన శంకరప్పకు 45 ఏళ్లు వచ్చినా పెళ్లి జరగలేదు. వచ్చిన సంబంధాలు వచ్చినట్లుగానే వెనక్కు వెళ్లిపోయేవి.
శంకరప్ప పెళ్లి మీద ఆశలు వదులుకున్నాడు. ఈ టైంలో మేఘన అనే 25 ఏళ్ల యువతితో అతడికి పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్యా ప్రేమ చిగురించింది. 2021 అక్టోబర్ నెలలో ఇద్దరూ పెళ్లి చేసకున్నారు. ఈ పెళ్లి సోషల్‌మీడియాలో బాగా వైరలైంది. కొద్దిరోజులు బాగానే ఉన్న వీరి కాపురంలో ఆస్తి గొడవలు మొదలయ్యాయి. శంకరప్పకు చెందిన రెండున్నర కోట్లు విలువచేసే స్థలాన్ని అమ్మాలని మేఘన అతడిపై ఒత్తిడి తెచ్చింది. స్థలం అమ్మటానికి అతడి తల్లి ఒప్పుకోలేదు. దీంతో తల్లీకొడుకుల మధ్య గొడవలు అయ్యేవి. గొడవల కారణంగా మనస్తాపం చెందిన శంకరప్ప చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : వాట్సాప్‌లో వీడియో కాల్.. లిఫ్ట్ చేస్తే కథ వేరేలా ఉంటది..