దైవదర్శనానికి వచ్చి దురదృష్టవశాత్తు నీటిలో మునిగి చనిపోయిన బాలిక విషయంలో ఆలయ అధికారులు చాలా కర్కషంగా వ్యవహరించారు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటు చేసుకుంది. కుటుంబంతో కలిసి యాదాద్రి శ్రీలక్ష్మినరసింహా స్వామి వారి దర్శనానికి వచ్చిన బొంతల రోజా అనే 15 ఏళ్ల బాలిక.. పుణ్యస్నానం ఆచరించేందుకు ఆలయ ప్రాంగణంలోని పుష్కరిలోకి దిగి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మరణించింది. అక్కడ ఉన్న వారు బాలికను నీటి నుంచి బయటికి తీశారు.
అప్పటి వరకు తమతో సంతోషంగా గడిపిన బాలిక ఇలా విగతజీవిగా మారడంతో బాలిక తల్లి కన్నీరుమున్నీరుగా విలపించింది. తన బిడ్డను కాపాడండి అంటూ తల్లడిల్లిపోయింది. దీంతో అక్కడున్న భక్తులు 108కి సమాచారం అందించారు. వైద్యసిబ్బంది ఇచ్చి పరిశీలించగా.. అప్పటికే బాలిక చనిపోయినట్లు నిర్ధారించారు. మృతదేహం పక్కనే ఆమె తల్లి దాదాపు రెండు గంటలపైగా రోదిస్తున్న ఆలయ సిబ్బంది పట్టించుకోలేదు.
హైదరాబాద్‌కు చెందిన మృతురాలి కుటుంబసభ్యులు.. మృతదేహాన్ని ఇంటికి తీసుకువెళ్లే స్తోమత కూడా లేని వారు. దీంతో ఏం చేయాలో తెలియక అక్కడే ఏడుస్తూ కూర్చున్నా కూడా ఆలయ అధికారులు కనీసం స్పందించలేదు. చివరికి.. మున్సిపాలిటీలో చెత్తను తరలించే వాహనంలో బాలిక మృతదేహాన్ని తరలించి అవమానించారు. పేదవారి పట్ల ఆలయ సిబ్బంది ప్రవర్తించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కనీసం అంబులెన్స్‌లోనైనా బాలిక మృతదేహాన్ని తరలించి ఉండాల్సి అంటూ అక్కడి వారు ఆలయ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Swetha Reddy: ప్రియుడ్ని చంపించిన శ్వేత కేసులో ఊహించని ట్విస్టు..
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.