Arvind Kejriwal : ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమా దేశ వ్యాప్తంగా పలు వివాదాలకు దారి తీస్తోంది. తాజాగా, ఈ సినిమాపై కామెంట్లు చేసిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ నివాసంపై పలువురు బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు. ఆయన ఇంటి ముందు ఉన్న బ్యారికేడ్లను పాడు చేయటంతో పాటు ఇంట్లోకి చొరబడే ప్రయత్నం చేశారు. బుధవారం ‘ది కశ్మీర్ పైల్స్’పై కేజ్రివాల్ చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ బీజేపీ శ్రేణులు నిరసన ర్యాలీ నిర్వహించాయి. ప్లకార్డులు, జెండాలతో ముఖ్యంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆయన ఇంటి వద్దకు బయలుదేరాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి గొడవలు జరగకుండా ఉండేందుకు వీరి వెంట పోలీసులు వెళ్లారు.
అయితే, ముఖ్యమంత్రి నివాసం వద్దకు చేరుకోగానే బీజేపీ శ్రేణులకు, పోలీసులకు మధ్య వివాదం చోటుచేసుకుంది. దీంతో బీజేపీ శ్రేణులు విరుచుకుపడ్డాయి. సీఏం ఇంటి ముందు ఉంచిన బ్యారికేడ్లను బీజేపీ కార్యకర్తలు విరగొట్టారు. అక్కడి సెక్యూరిటీ గార్డులు వారిని అడ్డుకున్నా ఆగకుండా సీఎం ఇంట్లోకి చొరబడ్డానికి ప్రయత్నించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఉప ముఖ్యమంత్రి సిసోడియా దీనిపై స్పందిస్తూ.. ‘‘ సంఘ విద్రోహ శక్తులు కొన్ని సీఎం ఇంటివద్ద ఉన్న సీసీటీవీ కెమెరాలను.. సెక్యూరిటీ బ్యారికేడ్లను సైతం ధ్వంసం చేశాయి. వాళ్లు ఎవరో కాదు! బీజేపీ గూండాలు’’ అని మండిపడ్డారు.రెండు రోజుల క్రితం కశ్మీర్ ఫైల్స్ సినిమాపై కేజ్రివాల్ మాట్లాడుతూ.. ‘‘ ఆ విషాదం జరిగి 32 ఏళ్లు గడిచింది. 32 ఏళ్ల తర్వాత ‘‘ కాశ్మీర్ పండితులారా మేము మీ కోసం సినిమా తీశాం’’ అని ప్రభుత్వం చెబుతోంది. కాశ్మీరీ పండిట్లకు కావాల్సింది సినిమా కాదు.. పునరావాసం’’ అని అన్నారు. కశ్మీర్ ఫైల్స్ సినిమాను ట్యాక్స్ ఫ్రీ చేయకూడదన్న నిర్ణయంపై మాట్లాడుతూ.. ‘‘ నా దృష్టిలో సినిమా ముఖ్యం కాదు.. బహుశా బీజేపీ వాళ్లకు ముఖ్యం కావచ్చు’’ అని అన్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Vandalism, Violence Outside Arvind Kejriwal’s Home Amid BJP Protest https://t.co/q4Ch7l5ni6 pic.twitter.com/ko4SUxB9m3
— NDTV (@ndtv) March 30, 2022
ఇవి కూడా చదవండి : వైరల్ పెళ్లి.. 5 నెలలు కూడా గడవకుండానే..