యాంకర్ దేవి నాగవల్లి – నటుడు విశ్వక్ సేన్ వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ విషయంలో కొంతమంది దేవికి మద్దతుగా నిలుస్తుంటే.. మరికొందరు మాత్రం విశ్వక్ సేన్ కి సపోర్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ప్రముఖ సామాజికవేత్త బాబు గోగినేని చేసిన రెండు వేరువేరు ట్వీట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ మొత్తం వ్యవహారంలో బాబు గోగినేని.. విశ్వక్ సేన్ కి మద్దతుగా నిలిచారు. “దేవి నాగవల్లి.. వీక్షకులతో పాటు విశ్వక్ సేన్‌కి క్షమాపణలు చెప్పాలి. ఆమె ముందుగా విశ్వక్ ని పాగల్ అని, డిప్రెషన్‌కి గురైన వ్యక్తి అని మాట్లాడిన తరువాతే ఈ వివాదం మొదలైంది” అని బాబు గోగినేని పోస్ట్ చేశారు.
దీంతో.. నిమిషాల్లోనే బాబు గోగినేని పోస్ట్ వైరల్ అయ్యింది. కానీ.., ఇదే సమయంలో దేవి నాగవల్లికి మద్దతుగా హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి ట్వీట్ చేశారు. “ఎంత కోపం, చిరాకు వచ్చినా మహిళలపై అలాంటి పదాలను ప్రేరేపించకూడదు. ఇలాంటి చర్యను సహించబోము. విశ్వక్ సేన్ అలాంటి నీచమైన వ్యాఖ్యలు చేయడం మానుకోవాలి” అని మేయర్ విజయలక్ష్మి ట్వీట్ చేశారు.
Strongly condemn the words spoken by @VishwakSenActor on @TV9Telugu Anchor @Devi_Nagavalli. No amount of anger or frustration should trigger such words against women. Such action will not be tolerated. Vishwaksen should Refrain from making such heinous comments. pic.twitter.com/BEhku4zIwQ
— Vijayalaxmi Gadwal, GHMC MAYOR (@GadwalvijayaTRS) May 3, 2022
విజయలక్ష్మి గారికి నమస్సులు..🌻🙏
మీరు పెద్దవారు.. స్త్రీ అనే ఒకే ఒక్క కారణం చేత @Devi_Nagavalli అనే అహంభావిని వెనకేసుకురావడం బాధగా ఉంది.. పూర్తిగా అక్కడ @TV9Telugu లో ఆ రోజు జరిగిన అంశాన్ని పరిగణలోనికి తీసుకుని మీ అభిప్రాయాన్ని నిర్ణయించుకొనవల్సినదిగా మనవి.
🌻🙏
— భానుడు..✍️🌻 (@ravikranthi9273) May 3, 2022
👇
Who started firsthttps://t.co/m4iihivmUG— Shiva Shankar (@ShivaS4India) May 3, 2022
సాటి మహిళ అని ఏమి చేసిన వెనకేసుకురావడం కరెక్ట్ కాదు తల్లి,మహిళ అంటున్నారు సరే మరి ఆ వాల్యూ నిలబెట్టుకునేప్రయత్నం దేవి చేసిందనే అనుకుంటున్నారా?మీడియా లో ఉందని ఎది పడితే అది,ఎలా పడితే అలా మాట్లాడేస్తే కరెక్టా?అందులో మీకు హీరోయిజం కనిపిస్తోందా?మహిళలకే మనోభావాలు ఉంటాయా?ఇంకెవరికి లేవా
— K T (@ikeytirumala) May 3, 2022
Plzzz react to her personal remarks as well ma’am.
As a mayor you should respond to both the version pic.twitter.com/eoyM5ccEP5— #ROHIT (@grviz18) May 3, 2022
ఈ వివాదంలో విశ్వక్ సేన్ తప్పు ఎంత ఉందో, దేవి నాగవల్లి తప్పు కూడా అంతే ఉందని.. నెటిజన్స్ మేయర్ చేసిన ట్వీట్ కు స్పందిస్తున్నారు. ఓ వ్యక్తిని రెచ్చగొట్టి అవమానించేందుకు మీరు మహిళలకు మద్దతు పలుకుతున్నారా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అక్కడుంది ఒక మహిళ కాబట్టి, మన రాష్ట్రంలో స్థిరపడి అతిథిగా వచ్చిన నటుడిని అవమానించవచ్చా? అంటూ.. నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అంటే మేయర్ ట్వీట్ కి వచ్చిన రెస్పాన్స్ అంతా కూడా బాబు గోగినేని చేసిన పోస్ట్ కి దగ్గరగా ఉండటం విశేషం. దీంతో.. విశ్వక్ సేన్ ని సపోర్ట్ చేసే వారికి బాబు గోగినేని పోస్ట్ పెద్ద ఆయుధంలా మారింది. మరి.. మొత్తం ఈ వ్యవహారంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.