ఆంధ్రప్రదేశ్‌లో నూతన కేబినెట్ ప్రమాణ స్వీకార కార్యక్రమం సోమవారం వైభవంగా జరిగింది. కొత్తగా మంత్రులుగా ఎన్నికైన వారితో రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణ స్వీకారం చేయించారు. పాత, కొత్తల కలయికగా కేబినెట్ ఏర్పాటయ్యింది. ఇక కొత్తవారిలో రోజా, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్ వంటి వారిని మంత్రి పదవులు వరించాయి. ఈ క్రమంలో మంత్రి అంబటి రాంబాబుకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరలయ్యింది. ఆయనకు సంబంధించిన కొన్ని పాత ఫోటోలు వైరల్ అయ్యాయి. వీటిని చూసిన వైసీపీ కార్యకర్తలు, అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. అంబటిలో ఈ యాంగిల్ కూడా ఉందా అని షాకవుతున్నారు. ఇంతకు ఏమా ఫోటోలు.. వాటి కథ ఏంటో తెలియాలంటే ఇది చదవండి.
ఇది కూడా చదవండి: మంత్రి పదవికి అంబటి రాంబాబు రాజీనామా! ఇదెక్కడి కామెడీ స్వామి?
ఏపీ జలవనరుల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు అంబటి రాంబాబు. ఇక ఆయనకు సినిమా ఇండస్ట్రీతో సన్నిహిత సంబంధాలున్నాయనే సంగతి అందరికి తెలిసిందే. జీవిత, రాజశేఖర్ లు కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేయడానికి .. తర్వాత వైఎస్ఆర్‌సీపీలో చేరడానికి అంబటి రాంబబే కారణం అని చాలా సార్లు చెప్పారు. అదంతా ఓకే కానీ.. అసలు అంబటి రాంబాబే సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి అని ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. ఈ క్రమంలో మంత్రి అంబటికి సంబంధించిన సుమారు 30 ఏళ్ల క్రితం నాటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
ఇది కూడా చదవండి: పదవుల కోసం వేంపర్లాడటం మా ఇంట వంట లేదు: మేకతోటి సుచరితఅంబటి రాంబాబు ఓ సినిమాలో నటించినట్లు కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంబటి రాంబాబు యుక్తవయసులో ఉన్నప్పుడు ఆ సినిమాలో నటించినట్లు ఫోటోల్లో స్పష్టమవుతోంది. అయితే ఆయన నటించింది ఏ సినిమాలో అనే విషయం, దాని డైరెక్టర్, సినిమాలో అంబటి పాత్ర ఏంటి వంటి విశేషాలు ఏవి తెలియలేదు. ఫోటోలో అంబటి పక్కనే మరో లేడీ ఆర్టిస్ట్ కూడా ఉన్నారు. ఆమె వివరాలు కూడా తెలియలేదు. ఇక ఈ ఫోటోలు చూస్తే దాదాపు 30ఏళ్ల క్రితం ఫోటోల మాదిరిగా ఉన్నాయి. అందులో యుక్త వయసులో ఉన్న అంబటి రాంబాబు…. చూడ్డానికి ఆకట్టుకునేవిధంగా ఉన్నారు. తాజాగా మంత్రి కావడంతో ఆయనకు సంబంధించిన ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. మరి ఆయన నటించిన సినిమా ఏదో మంత్రి అంబటే వెల్లడించాలని అభిమానులు కోరుతున్నారు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: ఓటములు, అవమానాలు, కన్నీళ్లు దాటి.. నేడు మంత్రిగా!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.