సెలబ్రిటీలు మొదలు.. సామాన్యుల వరకు తల్లిదండ్రులందరూ పిల్లల విషయంలో ఒకేలా ఆలోచిస్తారు. పిల్లలు చదువులో బాగా రాణించాలని కోరుకుంటారు. వారు బాగా చదివి.. మంచి మార్కులతో పాస్ అయినప్పుడు.. పిల్లల కన్నా ఎక్కువగా తల్లిదండ్రులే సంతోషిస్తారు. ఎంతో గర్వంగా నలుగురికి చెప్పుకుంటారు. ఈ విషయంలో సామాన్యులు, సెలబ్రిటీలు అనే తేడా ఉండదు. ప్రసుత్తం ఇదే రకమైన పుత్రోత్సాహాన్ని అనుభవిస్తున్నారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె, వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ఆమె పుత్రుడు గ్రాడ్యూయేషన్ వేడుకకు సంబంధించిన ఫోటోలను ట్విట్టర్‌లో షేర్ చేశారు షర్మిల. ఆ వివరాలు..
‘‘గ్రాడ్యూయేషన్ పూర్తి చేసుకున్నందుకు కంగ్రాట్యూలేషన్స్ రాజా.. నా పొత్తిళ్లలో నుంచి.. ఈరోజు ఇంత గొప్ప వ్యక్తిగా ఎదిగిన నిన్ను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. జీవితంలో ఎప్పుడు నిజాయితీగా, దయతో ఉండు.. నీ చుట్టూ ఉన్న వారికి విలువ ఇవ్వు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు.. మరేన్నో ఆశీర్వాదాలు నీకు అందజేస్తాడు.. నిన్ను చూసి గర్విస్తున్నాను చిన్నా..’’ అంటూ కూమారుడు రాజా గ్రాడ్యూయేషన్ డేకు సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు షర్మిలా. ఈ వేడుకకు షర్మిల తల్లి వైఎస్ విజయమ్మ, బ్రదర్ అనిల్ కూడా హాజరయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరలువుతున్నాయి. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Congratulations on your graduation Raja!
It was an absolute pleasure to watch you grow from the baby in my arms to the wonderful man you’ve become today. Be truthful & kind, always valuing the people around you.God bless you & make you a blessing to many!
Proud of you kiddo 🙂 pic.twitter.com/Biw0x2mkaj— YS Sharmila (@realyssharmila) May 20, 2022