తెలుగు రాష్ట్రాల ప్రజలలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గారిపై ఎంతటి గౌరవాభిమానాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రెండుసార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఆయన చేసిన సేవలు, ఆయన నెలకొల్పిన అభివృద్ధి కార్యక్రమాలను ఇంకా తెలుగు ప్రజలు మర్చిపోలేదు. ఆయన మరణించాక జనాలు ఎంతలా తల్లడిల్లిపోయారో.. ఆయనకు గుర్తుగా ఊరూరా ఆయన విగ్రహాలను ప్రతిష్టించారు. ప్రతి ఏడాది ఆయన జయంతి, వర్ధంతి వేడుకలు కూడా ఘనంగా జరుపుతుంటారు అభిమానులు, వైసీపీ కార్యకర్తలు.
అటువంటిది తాజాగా పార్వతీపురం మన్యం జిల్లా కృష్ణపల్లిలో ఓ యువకుడు వైఎస్ఆర్ విగ్రహం వద్ద హల్ చల్ చేశాడు. వైఎస్ఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసి రోడ్డుమీద ఈడ్చుకుంటూ వెళ్లాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక వైసీపీ కార్యకర్తలు ఆ యువకుడిని చితకబాది పోలీసులకు అప్పగించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎమ్మెల్యే జోగారావు ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.