మనిషికి అసహనం, ఆగ్రహం ఎక్కువైపోతే వస్తువులు బద్దలైపోతాయనడానికి ఈ శ్రీకాకుళం వ్యక్తే నిదర్శనం. ఇతగాడి అసహనం, ఆగ్రహం టన్నుల్లెక్కన ఉందేమో ఏకంగా ఏటీఎం మెషిన్ మీద తన ప్రతాపం చూపించాడు. ఏటీఎం నుంచి డబ్బులు రాలేదన్న కోపంతో ఏకంగా ఏటీఎం మెషిన్ నే ధ్వంసం చేశాడు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా పొందూరులో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
బూర్జ మండలానికి చెందిన పైడి సత్యనారాయణ డబ్బులు విత్ డ్రా చేసుకునేందుకు సోమవారం పొందూరు బస్టాండ్ లోని టాటా ఏటీఎంకు వెళ్లాడు. తన ఏటీఎం కార్డును ఉపయోగించి డబ్బు విత్ డ్రా చేసేందుకు ప్రయత్నం చేసినా డబ్బు రాలేదు. దీంతో తీవ్ర అసహనానికి గురైన సత్యనారాయణ ఏటీఎం మెషిన్ ను బద్దలుకొట్టాడు. సమాచారం అందుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రెస్టేషన్ ఎక్కువైతే.. ఇంట్లో వస్తువులు బద్దలు కొట్టుకోవాలి గాని పబ్లిక్ ప్రాపర్టీని బద్దలుకొడితే ఇదిగో ఇలానే పోలీసులు ఎత్తుకెళ్లిపోతారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇది చదవండి: ఫుల్ గా తాగి ట్రాన్స్ ఫార్మర్ ఎక్కి పడుకున్న తాగుబోతు! వీడియో వైరల్