యువత సముద్రం వద్ద సరదాగా గడపడానికి ఇష్ట పడుతుంటారు. అందుకు ఎప్పుడు ఖాళీ దొరికిన సముద్ర తీరానికి వెళ్లి తెగ ఎంజాయ్ చేస్తుంటారు. అయితే కొన్ని సార్లు సరదాగా బీచ్ లో గడుపుదామని వచ్చే యువతను రాకాసి అలలు మింగేసి..వారి ఇళ్లలో విషాదాన్ని నింపుతున్నాయి. తాజాగా ఇద్దరి బీ-ఫార్మసీ విద్యార్థులను రాకాసి అలలు బలి తీసుకున్నాయి. ఈఘటన మచిలీపట్నం బీచ్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..మచిలీపట్నానికి చెందిన కళ్లేపల్లి పూజిత (22), ఏలూరు జిల్లా గణపవరం మండలం పిప్పర గ్రామానికి చెందిన ప్రమీలారాణి జాస్మిన్(22), అదే మండలం గరగపర్రు గ్రామానికి చెందిన దత్తల ఆశాజ్యోతి భీమవరంలోని విష్ణు కాలేజీలో బీ–ఫార్మసీ చదువుతున్నారు.
ఈ నెల 21వ తేదీతో వారి ఫైనల్ ఇయర్ పరీక్షలు ముగిశాయి. దీంతో జాస్మిన్, ఆశాజ్యోతి కలసి స్నేహితురాలు పూజితతో మచిలీపట్నం వచ్చారు. పూజిత ఇంటి వద్ద ఆదివారం ముగ్గురు ఉల్లాసంగా గడిపారు. ఈక్రమంలో సోమవారం ఉదయం 9.30 గంటల సమయంలో బీచ్‌కు చేరుకున్నారు.దీంతో ముగ్గురు సముద్రం వద్దకు వెళ్లి స్నానం చేస్తూ సరదగా గడుపుతున్నారు. ఈక్రమంలోఒక్కసారిగా రాకాసి అలలు వారి ముగ్గురిని సముద్రంలోకి లాగాయి.స్థానికులు వెంటనే గమనించి ఆశాజ్యోతిని రక్షించగలిగారు. పూజిత, జాస్మిన్‌లను మెరైన్ పోలీసులు గాలించి ఒడ్డుకు చేర్చినా, అప్పటికే వారిద్దరు మృతి చెందారు.
ఇదీ చదవండి: మద్యం మత్తు.. రేంజ్ రోవర్‌తో యువతుల ర్యాష్ డ్రైవ్.. ఏకంగా ఎస్సైపైనే..రూరల్ ఎస్‌ఐ జి.వాసు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను 108లో బందరు జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అమ్మా! నేను బీచ్‌లో స్నానానికి వెళుతున్నా.. ఒడ్డుకు రాగానే నేనే ఫోన్ చేస్తానని చెప్పావు.. సముద్రంలోకి వెళ్లి మాయ మైపోయావా అమ్మా..అంటూ జాస్మిన్ తల్లి భోరున విలపించటం అక్కడి వారిని కలచివేసింది. చదువు పూర్తవుతుంది, మంచి జాబ్ సంపాదించి.. మీకు అండగా ఉంటామని మాటిచ్చి.. ఇప్పుడు ఇలా అర్ధాంతరంగా తమని వదలి వెళ్లారంటూ మృతురాళ్ల తల్లిదండ్రులు వాపోయారు. మరి.. ఈఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.