చేసేదే దొంగతనం.. మాకు ఇళ్లు, గుళ్లు అని తేడాలేముంటాయి. ఇదే దొంగల నోటి నుంచి వచ్చే మొదటి మాట. ఇన్నాళ్లు.. దొంగలంటే కూడా జాలి చూపే సమాజం మనది. తినడానికి తిండిలేక అలంటి పనులు చేస్తున్నారేమో అనుకునేవారు. కానీ, ఈ దొంగ చేసిన పని వింటే..ఛీ ఇంత దుర్మార్గుల అనుకుంటారు.
దొంగతనం చేయడానికి ఎక్కడో.. ఎందుకులే అనుకున్నాడేమో ఓ నీచుడు.. ఏకంగా ఆణిముత్యమైన సీతమ్మవారిని ఎంచుకున్నాడు. అమ్మవారి మెడలో ఎనిమిదికాసుల బంగారు చైన్ తెంపుకెళ్లాడు. వాహన పూజ చేయాలంటూ వచ్చిన దొంగ పూజారిని ఏమార్చి అమ్మవారి చైన్ ఎత్తుకెళ్లాడు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని అగ్రహారంలో ఉన్న సీతారామచంద్రలక్ష్మణ సమేత ఆలయంలో జరిగింది. ఇదంతా అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో రికార్డుయింది. ప్రస్తుతం ఆ దొంగను పట్టుకునే పనిలో ఉన్నారు పోలీసులు. ఈ నీచుడిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: వీడియో: తూర్పు గోదావరి జిల్లాలో వరద బీభత్సం.. చూస్తుండగానే కళ్ల ముందే కుప్పకూలిన ఆలయం
ఇదీ చదవండి: Nashik Trimbakeshwar Temple: నాసిక్ త్రయంబకేశ్వరాలయంలో అద్భుతం.. చైనాతో యుద్ధంతో తర్వాత మళ్లీ ఇప్పుడే!