జీవితంలో తనకంటూ ఏ కోరికలు లేని స్మశాన నివాసి పరమేశ్వరుడు. కంఠాన విషాన్ని దాచినా, అర్ధాంగికి తన శరీరంలో సగ భాగం ఇచ్చిన, నాగేంద్రుడిని ఆభరణంగా ధరించినా, గంగని తలపై నిలిపినా సర్వం ఆ త్రినేత్రుడికే చెల్లింది. ఓం నమఃశివాయ అని చేతులు ఎత్తి మొక్కే ఆ భోళా శంకరుడు.. జీవితంలో తనకంటూ ఏమి ఉంచుకోలేదు. అలాంటి శివయ్యకి ఇప్పుడు తనకి గుడి కట్టించుకోవాలని కోరిక కలిగింది. తన స్థలాన్ని తానే కాపాడుకోవాలని ఆయనే కదిలి వచ్చాడు. ఏకంగా ఓ భక్తురాలికి కలలోకి వచ్చి ఓ దైవ రహస్యం చెప్పాడు. ఆ మహా భక్తురాలు నిద్రలో నుండి బయటకి వచ్చి శివయ్య చెప్పిన చోట తవ్వగా ఆ పరమేశ్వరుని అద్భుతాన్ని చాటుతూ శివలింగం బయట పడింది. కాస్త.. ఆశ్చర్యంగా అనిపిస్తున్నా ఇది అక్షరాల నిజం. కృష్ణా జిల్లా కలిదిండి మండలం మూలలంక గ్రామం ఇందుకు వేదిక అయ్యింది.
మూల లంక గ్రామంలో శివాలయం నిర్మాణం కోసం 30 సంవత్సరాల క్రితమే కొంత భూమిని కేటాయించారు. కానీ.., అప్పటి నుండి ఆలయ నిర్మాణం జరగలేదు. ఖాళీగా పడి ఉన్న ఆ స్థలంలో తాజాగా గ్రామ సచివాలయం నిర్మించడానికి అన్నీ ఏర్పాట్లు జరిగిపోయాయి. నిర్మాణ పనులు కూడా ప్రారంభం అయ్యాయి. కానీ.., అంతలో అక్కడికి అదే గ్రామానికి చెందిన కొక్కిలిగడ్డ లక్ష్మి వచ్చింది. నిర్మాణాన్ని ఆపాల్సిందిగా అందరిని కోరింది. ఎందుకు ఆపాలని అడిగిన వారికి దిమ్మ తిరిగిపోయే సమాధానం ఇచ్చింది.
“నాకు కలలో శివయ్య కనిపించాడు. ఈ భూమిలో శివలింగం ఉంది. కావాలంటే ఇక్కడ తవ్వకాలు జరపండి.. శివయ్య అబద్దం చెప్పాడంటూ ఆ మహిళా భీష్మించుకుని కూర్చుంది”. ఇక లక్ష్మి చెప్పినట్లుగా అధికారులు, గ్రామ పెద్దల సమక్షంలో సదరు స్థలంలో తవ్వకాలు చేపట్టారు. రెండు అడుగుల లోతు తవ్వగా శివలింగం బయటపడింది. అది చూసి గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. వెంటనే విగ్రహానికి పూజలు చేయడం ప్రారంభించారు. ఈ విషయం ఆ నోట ఈ నోట అందరికి తెలియడంతో భక్తులు అక్కడికి తరలివచ్చారు.
శివలింగాన్ని దర్శించుకునేందుకు పోటీ పడ్డారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి.. ఇది ఆ శివయ్య మహిమ కాదు అంటారా? 30 ఏళ్ళ క్రితం తన గుడి కోసం ఎత్తి పెట్టిన స్థలాన్ని ఇప్పుడు ఆయనే కాపాడుకున్నాడన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియ చేయండి.