పశ్చిమ గోదావరి జిల్లాలో ఓప్రైవేటు ట్రావెల్లో భారీగా నగదు పట్టుబడింది. విజయనగరం నుంచి గుంటూరు వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సులో సుమారు రూ.5 కోట్ల నగదు దొరికింది. పశ్చిమ గోదావరి నల్లజర్ల మండలం వీరవల్లి టోల్ ప్లాజా వద్ద పోలీసులు తనీఖీలు చేస్తున్న క్రమంలో ఈ నగదును బయటపడింది. నిందితులు ప్యాసింజర్ సీట్ల కింద డబ్బును తరలిస్తున్నారు. బస్సు డ్రైవర్, క్లీనర్ ను అదుపులోకి తీసుకుని పోలీసులు. ఇంత పెద్ద మొత్తంలో నగదు తీసుకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నా. విజయనగరంలో ఉన్నప్పుడే ఈ డబ్బులను బస్సులో పెట్టారా? లేదా మార్గం మధ్యలో ఏమైన పెట్టారా? అనే విషయాలపై ఆరా తీస్తున్నారు పోలీసులు. నగదు తరలించడంపై ట్రావెల్ యాజమాన్యంపైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ దొరికిన నగదులు బస్సు యాజమాన్యానికి ఏమైనా సంబంధం ఉందా? లేదా ఈ అక్రమ నగదు రవాణా వెనుకు ఇంకేవరైనా బడబాబుల హస్తం ఉందా? అనే వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.