ఏపీలో సినిమా టికెట్ల వ్యవహారం బాగా ముదురుతోంది. రామ్ గోపాల్ వర్మ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆ వివాదం చినికి చినికి గాలివానగా మారింది. RGV ఎంతో మర్యాదపూర్వకంగా సినిమాటోగ్రఫీ మంత్రిని 10 ప్రశ్నలు అడగటం.. వాటికి సమాధానాలు కోరడం తెలిసిన విషయమే. ఆ తర్వాత సదరు మంత్రి ట్విట్టర్ వేదికగా స్పందించడం, RGVకి పలు ప్రశ్నలు సంధించడం జరిగింది. వాటిపై మళ్లీ రామ్ గోపాల్ వర్మ వరుస ట్వీట్లతో విరుచుకుపడుతున్నాడు. అయితే ఈ గ్యాప్ లో వ్యవహారం కొడాలి నానివైపు మళ్లింది. కొడాలి అనే వ్యక్తి ఇచ్చిన కౌంటర్ కు సమాధానం చెప్పమని నన్ను కొందరు అడుగుతున్నారు అంటూ రామ్ గోపాల్ వర్మ కొడాలి నానిపై సెటైర్లు వేశాడు.
A P టికెట్ రేట్ల విషయం లో నేను ప్రభుత్వాన్ని అడిగిన ప్రశ్నలకు సంభందించి ఎవరో కొడాలి నాని అనే వ్యక్తి ఇచ్చిన కౌంటర్ కి సమాధానం చెప్పమని కొందరు నన్ను అడుగుతున్నారు. నాకు తెలిసిన నాని న్యాచురల్ స్టార్ @NameisNani ఒక్కడే ..వాళ్ళు చెప్తున్న కొడాలి నాని ఎవరో నాకు తెలియదు.
— Ram Gopal Varma (@RGVzoomin) January 5, 2022
‘AP సినిమా టికెట్ల రేట్ల విషయంలో నేను ప్రభుత్వాన్ని అడిగిన ప్రశ్నలకు సంభందించి ఎవరో కొడాలి నాని అనే వ్యక్తి ఇచ్చిన కౌంటర్ కి సమాధానం చెప్పమని కొందరు నన్ను అడుగుతున్నారు. నాకు తెలిసిన నాని న్యాచురల్ స్టార్ ఒక్కడే.. వాళ్ళు చెప్తున్న కొడాలి నాని ఎవరో నాకు తెలియదు’ అంటూ ట్వీట్ చేశాడు. ఇప్పుడు ఈ ట్వీట్ వార్ పేర్ని Vs ఆర్జీవీగా మాత్రమే ఉంది. ఇప్పడు కొడాలి నాని Vs RGVగా మారుతుందేమో అంటూ భావిస్తున్నారు. ‘కొడాలి నాని అంటే ఎవరో నాకు తెలీదు’ అన్న ఆర్జీవీ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
My answers to the A P government’s honourable cinematography minister @perni_nani gaarus questions https://t.co/xwPXvOiuQ4
— Ram Gopal Varma (@RGVzoomin) January 5, 2022
నేను యావరేజ్ ఇంజినీరింగ్ స్టూడెంట్ని,@perni_nani garu ఎకనామిక్స్ గురించి నాకు
ఏ బీ సీ తెలియదు..కానీ అనుమతిస్తే మీ ప్రభుత్వం లో టాప్ ఎకనామిక్స్ ఎక్స్పర్ట్ తో నేను టీవీ డిబేట్ కి రెడీ..మా సినిమా ఇండస్ట్రీ కి ప్రభుత్వానికి ఏర్పడ్డ మిసండర్స్టాన్డింగు తొలగిపోవడానికి అవసరం ..థ్యాంక్యూ— Ram Gopal Varma (@RGVzoomin) January 5, 2022