తెలుగుదేశం పార్టీ 40వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కొత్త లోగోను ఆవిష్కరించారు. 40 ఏళ్ల సందర్భంగా ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగుదేశం కార్యకర్త, అభిమాని సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లెజండరీ డైరెక్టర్ రాఘవేంద్రరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్టీఆర్, తెలుగుదేశం పార్టీ, చంద్రబాబుతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.
‘నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నానంటే కేవలం అన్నగారి వల్లే మరొకరు కాదు. మీ విజన్ లో నన్ను కూడా పార్ట్ చేసినందుకు ఎలక్ట్రానికి మీడియా అడ్వైజర్ అనే పోస్టుతో ప్రజలకు సేవ చేసే అవకాశం కలిగింది. ఎస్వీబీసీ ఛైర్మన్ పదవితో దేవుడికి సేవ చేసే అవకాశం దక్కింది. మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను. మీరు స్టార్ట్ అనడిం.. మేము యాక్షన్ లోకి దిగుతాం. మిమ్మల్ని తిరిగి ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నాం’ అంటూ రాఘవేంద్రరావు వ్యాఖ్యానించారు. రాఘవేంద్రరావు వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.