ఈ మద్య కొంతమంది బడాబాబులు తాము అక్రమంగా సంపాదించిన సంపాదన (బ్లాక్ మనీ) ని కాపాడు కోవడానికి ఎన్నో రకాల జిమ్మిక్కులు చేస్తున్నారు. కొన్ని సార్లు ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తారన్న విషయం తెలియగానే ఆ బ్లాక్ మనీని రక రకాల పద్దతుల్లో ఇతర ప్రదేశాలకు తరలిస్తుంటారు. ఇందు కోసం ఇప్పుడు సామాన్యులు ప్రయాణించే రైళ్లు, బస్సులను ఎంచుకుంటున్నారు. పక్కా సమాచారం అందుకుంటున్న పోలీసులు తనిఖీలు చేపట్టడంతో కోట్ల సొమ్ముతో దొరికి పోతున్నారు. ఇటీవల ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో ఎక్కువగా అక్రమంగా తరలిస్తున్న డబ్బు పట్టుబడుతుంది.
ఓ ఆర్టీసీ బస్సులు డబ్బు తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు హైదరాబాద్ నుంచి కాకినాడకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఆపి తనిఖీ నిర్వహించారు. అందులో ఒక ప్రయాణీకుడి వద్ద భారీగా నగదు పట్టుబడింది. ఒక పెద్ద బ్యాగు లో ఆ వ్యక్తి దాదాపు కోటి 90 లక్షల రూపాయల వరకు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అతని వద్ద ఉన్న నగదు స్వాధీనం చేసుకున్నారు.
ఆ వ్యక్తిని స్టేషన్ కి తరలించారు. ఆ డబ్బుకు సంబంధించిన సరైన పత్రాలు ఏవీ లేవని అందుకే ఆ యువకుడిని అరెస్ట్ చేసి డబ్బు స్వాధీనం చేసుకున్నామని.. నగదు చిల్లకల్లు పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఒకవేల సరైన పత్రాలు చూపించినట్లయితే.. డబ్బు రిటన్ ఇస్తామని అన్నారు.