Pawan Kalyan: జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సహాయం చేయటంలో ముందుంటారన్న సంగతి తెలిసిందే. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవటానికి తన వంతు సాయం చేస్తూనే ఉంటారు. ఆయన తాజాగా, ఏపీలోని రైతు కుటుంబాలకు అండగా నిలవటానికి నిశ్చయించుకున్నారు. రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న ప్రతీ రైతు కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థిక సాయం చేస్తానని ప్రకటించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్య చేసుకున్న ప్రతీ కుటుంబాన్ని పరామర్శిస్తానని చెప్పారు. అప్పుల బాధతో రైతులు ఆత్మహత్య చేసుకోవటం బాధాకరమన్నారు.
కేవలం గోదావరి జిల్లాల్లో 80 మంది దాకా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, వ్యవసాయాన్ని నమ్ముకున్న వారి పరిస్థితి దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలలోని పిల్లల చదువులకు, ఇతర అవసరాలకు తన వంతుగా కొంతైనా అండగా నిలవాలనే ఉద్ధేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. కౌలు రైతులు, రైతులకు జనసేన పార్టీ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని అన్నారు. పవన్ కళ్యాణ్ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : పసి కందులకు పెళ్లి చేస్తున్న తల్లిదండ్రులు .. కారణం ఏంటంటే?..
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.