చంద్రబాబు ఇలాకలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నానా హంగామా చేస్తూ రచ్చ రచ్చ చేశారు. నాలుగేళ్ల తర్వాత RRR సినిమాలో ఎన్టీఆర్ ని తెరమీద చూడడంతో తారక్ ఫ్యాన్స్ ఆనందంతో పరవశించిపోతున్నారు. ఇక శుక్రవారం విడుదలైన RRR మూవీ సూపర్ డూపర్ హిట్ అని టాక్ రావడంతో ఎన్టీఆర్ అభిమానులు పండగా చేసుకుంటున్నారు.
ఇది కూడా చదవండి: RRR Collections: బాహుబలి రికార్డ్స్ బ్రేక్ చేసిన RRR.. మొదటి రోజే ఊచకోత!
తాజాగా చిత్తూరు జిల్లా కుప్పం మండలంలోని ఊరినాయనపల్లిలో తారక్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ ఫోటోతో ఉన్న జెండాను ఆవిష్కరించి సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. ఇక ఇంతటితో ఆగకుండా బాబులకే బాబు తారక్ బాబు అంటూ నానా హంగామా చేశారు. ఈ దృశ్యాలను వీడియో తీసి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో వైరల్ గా మారింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ నినాదాలపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.