గత కొన్ని రోజలుగా ఏపిలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వర్సెస్ ఏపి మంత్రి పేర్ని నాని మధ్య మాటల యుద్దం ఓ రేంజ్ లో కొనసాగుతుంది. ఇటీవల విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను నిరసిస్తూ పవన్ దీక్ష చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఏపి ప్రభుత్వానికి కౌంటర్ ఇచ్చారు. తెలుగు సినిమా పరిశ్రమను దెబ్బకొట్టడం ద్వారా తన ఆర్థిక మూలాలు దెబ్బకొట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. ముఖ్యంగా తన సినిమాలను టార్గెట్ చేసుకొని ఆర్థికంగా దెబ్బతీయాలని భావిస్తున్నారని చెప్పారు.
పంతానికి దిగితే ఆంధ్రప్రదేశ్‌లో తన సినిమాలు ఉచితంగా చూపిస్తానన్నారు. సినిమా టికెట్లకు పారదర్శకత లేదంటున్నారని.. మీరు అమ్మే మద్యానికి పారదర్శకత ఉందా? అని ప్రశ్నించారు. అలాగే ఏపీలో రూ.700కు మద్యం కొనండి.. రూ.5తో సినిమాకు వెళ్లండి అంటూ పవన్ కళ్యాణ్ సెటైర్లు వేశారు. తాజాగా జనసేనాని చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ ఛాలెంజ్ చేశారు. ఏపీ మంత్రి పేర్ని నాని మరోసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై విరుచుకుపడ్డారు. పవన్ కళ్యాణ్ ఫ్రీగా అంటే నమ్మలేం.. ఛాలెంజ్ చేస్తున్నా, నిలబడమని చెప్పండి.. ఫ్రీగా చూపించమని చెప్పండి అంటూ రివర్స్ కౌంటర్ ఇచ్చారు.
ఇదీ చదవండి : భార్యను ఆస్పత్రికి తీసుకెళ్లకుండా.. యూట్యూబ్ చూస్తూ డెలివరీ చేసిన భర్త
గ్రామాల్లో తెరలు కట్టి సినిమాలు వేసేవాళ్లు అలాగే తెరలు కట్ట సినిమా చూపించమని చెప్పండి మాకు అస్సలు అభ్యంతరం ఉండదు.. ఎందుకంటే డబ్బులు వసూలు చేస్తే ప్రభుత్వం వస్తుంది కానీ.. ఫ్రీగా అయితే తమకేం సంబంధం అన్నారు. ఆయన ఉపన్యాసాలు, మాటలు విన్నవాడు ఎవడైనే గాడి తప్పినవాడికి, పవన్ మాటలు నమ్మినోడికి తేడా ఉండదని ఎద్దేవా చేశారు. మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలపై జనసైనికులు మండిపడుతున్నారు. మంత్రి పేర్ని నాని చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.